బాధ్యతాయుతమైన పోలీసు శాఖలో పనిచేస్తూ బెట్టింగుల్లో పాల్గొన్నాడో పోలీస్. అంతేకాదు రూ.కోటిన్నర గెలుచుకున్నాడు. దీంతో ఆయనను సస్పెండ్ చేశారు.
మహారాష్ట్ర : ఓ ఎస్ఐ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ డ్రీమ్ 11లో కోటిన్నర రూపాయలు గెలుచుకున్నాడు. దీంతో ఈ వార్త దావనళంలా వ్యాపించి, సదరు ఎస్సై సోమనాథ్ వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. అయితే, కోటిన్నర గెలిచిన ఆనందం కాసేపట్లోనే హరించిపోయింది. పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగిస్తూ.. నిబంధనలు అతిక్రమించారంటూ మహారాష్ట్ర ఏసిపి సతీష్ మానే ఎస్ఐ సోమనాథ్ ను సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ సస్పెన్షన్ తో మరోసారి వార్తల్లో ప్రముఖంగా మారారు సోమనాథ్.
దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. మహారాష్ట్రలోని పింప్రీ చించివాడు పోలీస్ కమిషనరేట్ లో సోమనాథ్ ఎస్సైగా పనిచేస్తున్నారు. అక్టోబర్ 10వ తేదీన జరిగిన ఇంగ్లాండ్ బంగ్లాదేశ్ మ్యాచ్ సమయంలో ఆయన విధుల్లో ఉండి బెట్టింగుల్లో పాల్గొన్నారు. ఈ మేరకు వివరాలు వెలుగులోకి రావడంతో.. ఆయన మీద తదుపరి విచారణ జరిపించాలని డిసిపిని ఆదేశించారు. ఈ విచారణలో ఎస్ఐ సోమనాథ్ గత మూడు నెలలుగా డ్రీం 11లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నట్లుగా వెళ్లడైంది.
నకిలీ జనన ధ్రువపత్రం కేసు : ఉత్తరప్రదేశ్ సమాజ్ వాదీ పార్టీ నేత ఆజాంఖాన్ కు ఏడేళ్ల జైలు...
వన్డే ప్రపంచ కప్ లో భాగంగా ఇంగ్లాండ్ బంగ్లాదేశ్ ల మధ్య జరిగిన మ్యాచ్లో ఎస్ఐ సోమనాథ్ బెట్టింగ్ కాశారు. బాగా ఆడిన ఆటగాళ్లతో జట్టును ఎంపిక చేసుకున్నారు సోమనాథ్. అలా ఫాంటసీ గేమ్ లో అగ్రస్థానంగా నిలిచారు. దీంతో రూ. కోటిన్నర గెలుచుకున్నారు. డబ్బులు రావడంతో కుటుంబ సభ్యులు సంతోషంతో మిఠాయిలు పంచుకున్నారు. సంబరాలు చేసుకున్నారు. కానీ, ఉన్నతాధికారులు తీసుకున్న ఈ చర్యతో షాక్ అయ్యారు. వారి ఆనందం క్షణాల్లో ఆవిరైంది.