ద్వందార్థాలతో ఎస్ఐ టిక్ టాక్ వీడియోలు

Published : Jun 26, 2020, 11:09 AM IST
ద్వందార్థాలతో ఎస్ఐ టిక్ టాక్ వీడియోలు

సారాంశం

టిక్‌టాక్‌లో పలువురి మహిళలతో ద్వంద్వార్థ సంభాషణలు చేస్తూ వందలాది వీడియోలను అప్‌లోడ్‌ చేస్తున్నారు. 2019 ఏప్రిల్‌ నుంచి మహిళలతో డ్యూయెట్లు పాడడం, నృత్యాలు చేయడం వంటి వేలాది వీడియోలను అప్‌లోడ్‌ చేశారు. 

టిక్ టాక్ యాప్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ యాప్ లో పాటలకు డ్యాన్స్ లు వేసి.. చాలా మంది పాపులారిటీ సంపాదించుకున్నారు. కాగా.. ఈ టిక్ టాక్ మోజులో పడి ప్రాణాలు పోగొట్టుకున్నవారు కూడా ఉన్నారు. చాలా మంది జీవితాలు కూడా నాశనమయ్యాయి. కాగా.. ఈ కోవలో కి ఓ ఎస్ఐ కూడా చేరిపోయారు.

చెన్నై సెక్రటరియేట్‌ కాలనీ పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న కల్యాణ సుందరం (53) చేరారు. ఇతను టిక్‌టాక్‌లో పలువురి మహిళలతో ద్వంద్వార్థ సంభాషణలు చేస్తూ వందలాది వీడియోలను అప్‌లోడ్‌ చేస్తున్నారు. 2019 ఏప్రిల్‌ నుంచి మహిళలతో డ్యూయెట్లు పాడడం, నృత్యాలు చేయడం వంటి వేలాది వీడియోలను అప్‌లోడ్‌ చేశారు. అన్ని పాటలు, సంభాషణలు ద్వందార్థాలతో ఉంటున్నాయి.

 ఈ వీడియోలన్నీ పోలీసుస్టేషన్‌ లోపలే తీస్తున్నట్టు తెలుస్తోంది. కాగా.. ఈ వీడియోల పట్ల ఉన్నతాధికారులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంతేకాకుండా ఈయన విధుల్లో ఉన్నప్పుడు అనేక సమయాల్లో సెల్‌ఫోన్లలో మాట్లాడుతునే ఉంటాడని, అనేకసార్లు ఉన్నతాధికారుల మందలింపులకు గురైనట్లు సమాచారం. అందుచేత పోలీసు వృత్తికి ఇటువంటి కళంకం ఏర్పరిచే వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు పోలీసులు కోరుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?
Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?