తారుమారైన డోపింగ్ ఫలితాలు: ఎట్టకేలకు అర్జున అవార్డు

By Sreeharsha GopaganiFirst Published Jun 26, 2020, 9:10 AM IST
Highlights

కామన్‌వెల్త్‌ క్రీడల స్వర్ణ పతక విజేత, యువ వెయిట్‌లిఫ్టర్‌ సంజీత చాను ఎట్టకేలకు అర్జున అవార్డు అందుకోనుంది. కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో పసిడి ఎత్తిన సంజిత తదనంతర డోపింగ్  పరీక్షల్లో విఫలమైన సంగతి తెలిసిందే.  

కామన్‌వెల్త్‌ క్రీడల స్వర్ణ పతక విజేత, యువ వెయిట్‌లిఫ్టర్‌ సంజీత చాను ఎట్టకేలకు అర్జున అవార్డు అందుకోనుంది. కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో పసిడి ఎత్తిన సంజిత తదనంతర డోపింగ్  పరీక్షల్లో విఫలమైన సంగతి తెలిసిందే.  

2018లో సంజిత చాను అర్జున అవార్డుకు ఎంపికైనా.. డోపింగ్‌ పరీక్షలో విఫలమైన కారణంగా అవార్డును నిరాకరించారు. సంజిత చాను శాంపిల్స్‌ నాడా ల్యాబ్‌లో తారుమారు అయ్యాయి. డోపింగ్‌లో పట్టుబడిన శాంపిల్‌ ఎవరిదనే విషయం సైతం నాడా, వాడా వద్ద సమాచారం లేదు. 

దీంతో అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ సమాఖ్య సంజిత చానుపై నిషేధం ఎత్తివేసి, క్షమాపణలు సైతం తెలిపింది. 2018 ఢిల్లీ హైకోర్టు ఆదేశాల ప్రకారం డోపింగ్‌ ఆరోపణల నుంచి బయటపడితే, సంజితను అర్జున పురస్కారానికి పరిగణనలోకి తీసుకోవాలి అని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి.. 

' సంజితపై డోపింగ్‌ ఆరోపణలను అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ ఫెడరేషన్‌ కొట్టిపారేసింది. ఇప్పుడు మేం ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను పాటించాల్సి అవసరం ఉంది. అర్జున అవార్డుకు సంజిత పేరును పరిగణనలోకి తీసుకుంటాం' అని క్రీడామంత్రిత్వ శాఖ అధికారులు పేర్కొన్నారు.

ఈ మణిపూర్ కి చెందిన వెయిట్ లిఫ్టర్ 2014, 2018 కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పథకాన్ని సాధించింది. మణిపూర్ దిగ్గజ వెయిట్ లిఫ్టర్ కుంజారాణి దేవి స్ఫూర్తిగా ఈ క్రీడను ప్రొఫెషన్ గా ఎంచుకొని విజయాలు సాధించింది. 

2014లో 48 కేజీల కేటగిరిలో పోటీపడి కామన్వెల్త్ గోల్డ్ కొట్టిన సంజీత.... 2018లో 53 కేజీల కేటగిరిలో పోటీ పది మరోసారి స్వర్ణం సాధించింది. రెండవ స్థానాల్లో నిలిచిన లిఫ్టర్ కన్నా పది కిలోలు ఎక్కువగా ఎత్తి పథ రికార్డులను కూడా బద్దలుకొట్టింది. 

ఇలా సాగిపోతున్న తన కెరీర్ లో డోపింగ్ ఆరోపణ ఆమె కెరీర్ ను కుదిపేసింది. ఆమె నమూనాలో టెస్టోస్టిరాన్ లభించిందని ఆమెపై నిషేధం విధించారు. కానీ శాంపిల్ తారుమారైందని తేలడంతో.... ఆమెకు క్షమాపణలు చెప్పడం మినహా అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య ఏమీ చేయలేకపోయింది. ఎట్టకేలకు ఆమె అర్జున అవార్డు అందుకోనుంది 

click me!