వీటి కారణంగా మన దేశంలో దాదాపు 4లక్షల మందికి కరోనా సోకే ప్రమాదం ఉందని.. వారిలో 12వేల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని తెలుస్తోంది.
దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ప్రతి రోజూ 15వేలకు పైగా కేసులు నమోదౌతున్నాయి. అయితే.. రానున్న రోజుల్లో ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకు దేశంలో ఉన్న వేశ్యావాటికల్ కారణం కానున్నాయని చెబుతున్నారు.
దేశంలో లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత ఇప్పటికే పలు చోట్ల సెక్స్ రాకెట్స్ నిర్వహించారంటూ ఇటీవల వార్తలు వస్తునే ఉన్నాయి. పోలీసులకు దొరకకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నవారు ఇంకా చాలా మందే ఉన్నారు. కాగా... ఈ వ్యభిచార గృహాలు కరోనా వ్యాప్తి కి కారణం కానున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వీటి కారణంగా మన దేశంలో దాదాపు 4లక్షల మందికి కరోనా సోకే ప్రమాదం ఉందని.. వారిలో 12వేల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయాలు యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్, హా ర్వర్డ్ మెడికల్ స్కూల్ విద్యావేత్తల అధ్యయనంలో వెల్లడైంది. వైశ్యావాటికలను మరికొంత కాలం మూసేయడం ద్వారా కొవిడ్ మరణాలను 60 శాతం తగ్గించొచ్చని ఓ నమూనాను విద్యావేత్తలు అభివృద్ధి చేశారు.
సెక్స్ వర్కర్ల ద్వారా కొవిడ్ ఇతరులకు వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనకర్తలు తెలిపారు. సం భోగం సమయంలో వైరస్ సోకిన వ్యక్తుల ద్వారా కొవిడ్ ఇతరులకు వ్యాప్తి చెందుతుంది. ఆ వ్యక్తి పలు ప్రాంతాల్లో ఇతరులను కలవడం, మాట్లాడటం, ఇలా అనేక సంఘటనలతో వైరస్ వ్యాప్తి గణనీయంగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు తమ అధ్యయనంలో తేల్చారు.