ఫ్రెండ్‌ను కలవడానికి వెళ్లినందుకే శ్రద్ధా వాకర్ హత్య! మర్డర్ కారణంపై చార్జిషీట్‌లో పోలీసుల వివరణ ఇదే

Published : Jan 24, 2023, 06:45 PM IST
ఫ్రెండ్‌ను కలవడానికి వెళ్లినందుకే శ్రద్ధా వాకర్ హత్య! మర్డర్ కారణంపై చార్జిషీట్‌లో పోలీసుల వివరణ ఇదే

సారాంశం

శ్రద్ధా వాకర్ హత్య గురించి పోలీసులు కీలక విషయాన్ని వెల్లడించారు. ఆమె హత్యకు గల కారణాన్ని తెలిపారు. శ్రద్ధా వాకర్ ఆమె ఫ్రెండ్‌ను కలవడం అఫ్తాబ్ పూనావాలాకు తీవ్ర ఆగ్రహం తెప్పించిందని వివరించారు. ఆ కోపంలోనే శ్రద్ధా వాకర్‌ను హత్య చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.  

న్యూఢిల్లీ: శ్రద్ధా వాకర్ హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అత్యంత క్రూరంగా శ్రద్ధా వాకర్ హత్య జరిగింది. ఆమె బాయ్‌ఫ్రెండ్ అఫ్తాబ్ పూనావాలా ఆమెను ముక్కలుగా నరికి ఫ్రిడ్జీలో భద్రపరిచాడు. ఆ తర్వాత వాటిని సుమారు మూడు వారాల వ్యవధిలో సమీపంలోని అడవిలో పడేసి వచ్చాడు. ఈ కేసులో పోలీసులు 6,629 పేజీల చార్జిషీట్‌ను దాఖలు చేశారు. ఇందులో శ్రద్ధ వాకర్‌ను అఫ్తాబ్ పూనావాలా హత్య చేయడానికి గల కారణాలను పేర్కొన్నారు.

శ్రద్ధా వాకర్ ఓ ఫ్రెండ్‌ను కలవడానికి వెలళ్లిందని, ఆ విషయమే అఫ్తాబ్ పూనావాలాకు కోపం తెప్పించిందని పోలీసులు పేర్కొన్నారు. ఆమె ఓ ఫ్రెండ్‌ను కలవడానికి వెళ్లిందనే వాస్తవం అఫ్తాబ్ పూనావాలకు నచ్చలేదని తెలిపారు. అతను చాలా ఆందోళన చెందాడని వివరించారు. తీవ్ర ఆగ్రహంతో అదే రోజు ఆమెను చంపేశాడని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీసు మీను చౌదరి విలేకరులకు ఈ రోజు వెల్లడించారు.

Also Read: శ్రద్ధా వాకర్‌ను రంపంతో కోసి.. శ‌రీరాన్ని ముక్క‌లు చేసిన అఫ్తాబ్.. పోస్టుమార్టంలో సంచ‌ల‌న విష‌యాలు

మహారాష్ట్రకు చెందిన శ్రద్ధా వాకర్, ఆఫ్తాబ్ పూనావాలా ఇద్దరూ లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో కలిసి ఉన్నారు. ఆ తర్వాత వారు ఢిల్లీకి షిఫ్ట్ అయ్యారు. అక్కడే శ్రద్ధా వాకర్‌ను ఆప్తాబ్ పూనావాలా దారుణంగా చంపేశాడు. ఆమె డెడ్ బాడీని 35 భాగాలుగా నరికి రాత్రి 2 గంటల సమయంలో కొన్ని రోజులపాటు ఆ శరీర భాగాలను మెహ్రౌలీ అటవీ ప్రాంతంలో వేర్వేరు చోట్ల పడేసి వచ్చాడు. ఈ కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

PREV
click me!

Recommended Stories

బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
MBA, PGDM.. ఏది చదివితే కెరీర్ బాగుంటుంది?| CS Sharma | Access Career Counselors| AsianetNews Telugu