సీక్రెట్ డాక్యుమెంట్లను సుప్రీంకోర్టు బహిర్గతం చేయడం చాలా ఆందోళనకరం: న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు

By Mahesh KFirst Published Jan 24, 2023, 5:35 PM IST
Highlights

సుప్రీంకోర్టుపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు మరో కామెంట్ చేశారు. ముగ్గురు న్యాయమూర్తుల సిఫారసులను వ్యతిరేకిస్తూ కేంద్రం చేసిన అభ్యంతరాలను, వాటికి సుప్రీంకోర్టు ఇచ్చిన కౌంటర్‌లను బహిరంగం చేసింది. ఇందులో రా, ఐబీలు ఇచ్చిన వివరాలనూ సుప్రీంకోర్టు బయటపెట్టింది. దీనిపై కిరణ్ రిజిజు అభ్యంతరం తెలిపారు.
 

న్యూఢిల్లీ: న్యాయమూర్తుల నియామకాలపై సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఘాటు వ్యాఖ్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, న్యాయశాఖ మంత్రి సుప్రీంకోర్టుపై కామెంట్ చేశారు. ముగ్గురు న్యాయమూర్తుల పదోన్నతి పై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు చెబుతూ తిరస్కరిస్తూ వస్తున్నది. సుప్రీంకోర్టు మరోసారి వారి పేర్లను పదోన్నతి కోసం సిఫారసు చేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం చెబుతున్న అభ్యంతరాలను, వాటికి సుప్రీంకోర్టు సమాధానాలను బహిర్గతం చేసింది. ఈ రెంటినీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. అయితే, ఈ సందర్భంగా సుప్రీంకోర్టు అందులో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)ల డాక్యుమెంట్‌నూ బయటపెట్టింది. రా, ఐబీల డాక్యుమెంట్‌లను బయటపెట్టడం చాలా ఆందోళనకరం అని సుప్రీంకోర్టు పై న్యాయ శాఖ మంత్రి కామెంట్ చేశారు.

‘రా, ఐబీల సీక్రెట్, సెన్సిటివ్ రిపోర్టులను బహిరంగ పరచడం చాలా ఆందోళనకరం, దీనిపై నేను తగిన సమయంలో స్పందిస్తాను. వాటిపై మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు’ అని న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు విలేకరులకు తెలిపారు.

Also Read: గే లాయర్ పదోన్నతిపై కేంద్రంతో విబేధించిన సుప్రీంకోర్టు.. వివరాలను తొలిసారి బహిర్గతం చేసిన న్యాయస్థానం

‘ఒక వేళ ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అధికారి మన దేశం కోసం చాలా రహస్య ప్రాంతంలో సీక్రెట్ మోడ్‌లో లేదా ఇతర రూపంలో ఉండి ఉండొచ్చు. రేపు తన రిపోర్టును బహిర్గతం చేసే అవకాశం ఉంటుందా? దాని ద్వారా విపరీత పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందా? వంటి వాటిపై ఆ అధికారి ఆలోచించే అవసరం ఉంటుంది. కాబట్టి, దీనిపై నేను ఇప్పుడు కామెంట్ చేయను’ అని వివరించారు.

ఈ విషయాన్ని మీరు సీజేఐ దృష్టికి తీసుకెళ్తారా? అని అడగ్గా.. ‘చీఫ్ జస్టిస్, నేను తరుచూ కలుస్తుంటాం. మేం ఎల్లప్పుడూ టచ్‌లోనే ఉంటాం. ఆయన జ్యూడీషియరీకి హెడ్. నేను కేంద్ర ప్రభుత్వానికి, జ్యుడీషియరీకి మధ్య వారధి వంటివాడిని. మేం కలిసి పని చేయాల్సి ఉంటుంది. ఎవరికి వారం ఏకాకిగా ఉండలేం. ఇది వివాదాస్పదమైన అంశమే కానీ, దీన్ని మరో రోజుకు వాయిదా వేద్దాం’ అని అన్నారు.

click me!