శ్రద్ధా వాకర్ ఎముకలను దంచి పౌడర్ చేశాడు.. చివరిగా మూడు నెలల తర్వాత తలను పడేశాడు: ఢిల్లీ పోలీసులు

By Mahesh KFirst Published Feb 7, 2023, 7:57 PM IST
Highlights

శ్రద్ధా వాకర్ డెడ్ బాడీని 35 ముక్కలుగా నరికి ఫ్రిడ్జీలో పెట్టిన ఆఫ్తాబ్ పూనావాలా కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆమె ఎముకలను దంచి పౌడర్ చేశాడని, మూడు నెలల తర్వాత చివరిగా ఆమె తలను బయట పడేసినట్టు ఢిల్లీ పోలీసులు తాజాగా చార్జిషీటులో వెల్లడించారు.
 

న్యూఢిల్లీ: శ్రద్ధా వాకర్ హత్య కేసులో ఢిల్లీ పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. ఇందులో శ్రద్ధా వాకర్ హత్య గురించి దారుణమైన విషయాలను పేర్కొన్నారు. శ్రద్ధా వాకర్ ఎముకలను స్టోన్ గ్రైండర్‌తో ఆఫ్తాబ్ పూనావాలా పొడి చేసి పడేశాడని తెలిపారు. మూడు నెలల తర్వాత చివరిగా ఆమె తలను పడేసినట్టు వివరించారు. గతేడాది మే 18న శ్రద్ధా వాకర్‌ను హత్య చేసిన తర్వాత జొమాటో ద్వారా చికెన్ రోల్ నుంచి ఆర్డర్ పెట్టుకుని భోజనం చేసినట్టు పేర్కొన్నారు. 

ఆఫ్తాబ్ పూనావాలా, శ్రద్ధా వాకర్ ఓ డేటింగ్ యాప్‌లో పరిచయం ప్రేమలో పడ్డారు. డేటింగ్ చేశారు. ముంబయి నుంచి ఢిల్లీకి వెళ్లి అక్కడ ఓ ఫ్లాట్‌లో నివసించారు. ఆఫ్తాబ్ పూనావాలా చాలా మంది మహిళలతో టచ్‌లో ఉండేవాడు. ఈ విషయం శ్రద్ధా వాకర్‌కు నచ్చేది కాదు. ఈ విషయంతోపాటు ఇంటి ఖర్చులు, ఇతర విషయాలపైనా ఇద్దరికీ తరుచూ గొడవలయ్యేవి. మే 18న వారిద్దరూ తిరిగి ముంబయికి వచ్చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. కానీ, ఉన్నట్టుండి ఆఫ్తాబ్ పూనావాలా ట్రైన్ టికెట్లు క్యాన్సిల్ చేశాడు. ఆ తర్వాత ఎక్స్‌పెన్సెస్ విషయమై ఇరువురి మధ్య మళ్లీ గొడవ జరిగింది. ఈ గొడవ జరుగుతుండగానే ఆఫ్తాబ్ పూనావాలా శ్రద్ధా వాకర్ గొంతు నులిమేశాడని పోలీసులు తెలిపారు.

చార్జిషీటు ప్రకారం, శ్రద్ధా వాకర్ డెడ్ బాడీని ముందుగా ప్లాస్టిక్ బ్యాగ్‌లో చుట్టేసి బయటపడేద్దామని ఆఫ్తాబ్ పూనావాలా అనుకున్నాడు. అందుకోసం ప్లాస్టిక్ బ్యాగ్ కూడా కొన్నాడు. కానీ, అలా ప్లాస్టిక్ బ్యాగ్‌లో పడేస్తే తొందరగా దొరికి పోతానని ఆఫ్తాబ్ పూనావాలా అనుకున్నాడు. అందుకే ఆ ఐడియాను రద్దు చేసుకున్నాడు. ఆమె బాడీని ముక్కలుగా కట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఓ రంపం, సుత్తె, మూడు కత్తులను కొనుగోలు చేశాడు. ఆ తర్వాత బ్లో టార్చ్ ను కూడా యూజ్ చేశాడు. ముఖ్యంగా ఆమె చేతి వేళ్లను కత్తిరించడానికి దీన్ని యూజ్ చేశాడని పోలీసులు వివరించారు.

Also Read: ఢిల్లీ టు దుబాయ్.. ఆఫ్తాబ్ పూనావాలా చాలా మంది గర్ల్‌ఫ్రెండ్స్‌తో టచ్‌లో ఉన్నాడు: పోలీసులు

శ్రద్ధా వాకర్ డెడ్ బాడీని 35 ముక్కలుగా నరికి ఫ్రిడ్జీలో పెట్టాడు. ఎప్పుడైనా అతని గర్ల్‌ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినప్పుడు ఫ్రిడ్జీలో నుంచి ఆ ప్యాకేజీలను బయటకు తీసి కిచెన్‌లో పెట్టేవాడనీ చార్జిషీటులో పోలీసులు తెలిపారు.

శ్రద్ధా వాకర్ మరణించిన తర్వాత కూడా ఆమె ఫోన్‌ను దగ్గరే ఉంచుకున్నాడు. మే 18వ తేదీ తర్వాత కూడా ఫోన్ నడుస్తూనే ఉన్నదని ఆమె గూగుల్ డేటా రివీల్ చేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆమె ఫోన్‌తోపాటు లిప్‌స్టిక్‌ను ముంబయిలో పడేసినట్టు పోలీసులు వివరించారు.

20 కన్న తక్కువ ఆమె డెడ్ బాడీ పీసెస్‌ను పోలీసులు రికవరీ చేసుకున్నారు. ఆమె తలను ఇంకా రికవరీ చేసుకోవాల్సి ఉన్నది.

పాలిగ్రాఫ్, నార్కో అనాలిసిస్ టెస్టుల్లో ఈ నేరాన్ని చేసినట్టు ఆఫ్తాబ్ పూనావాలా అంగీకరించాడు. హత్య తర్వాత ఆఫ్తాబ్ పూనావాలా తీవ్ర పశ్చాత్తాపానికి లోనైనట్టూ చార్జిషీట్‌లో పోలీసులు పేర్కొన్నారు.

click me!