అయోధ్య ఆలయ ప్రారంభోత్సవానికి ముందు బీజేపీ అనవసర ప్రకటనలు చేయొద్దని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. భక్తి శ్రద్ధలతో ఉండాలని, శాంతి సామరస్యాలను కాపాడాలని పిలుపునిచ్చారు.
2024 జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముందు జరిగిన గత కేబినెట్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ మంత్రులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. ‘ఇండియా టుడే’ కథనం ప్రకారం.. మంత్రులు తమ విశ్వాసాన్ని, భక్తిని చూపించాలని సూచించారు. కానీ దూకుడు ప్రదర్శించవద్దని అన్నారు.
భారత్ మాకు ‘కాల్ 911’ వంటిది.. నమ్మకమైన మిత్రదేశం - మల్దీవుల మాజీ మంత్రి
అనవసర ప్రకటనలు చేయొద్దని, ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ముందు పార్టీ పరువుకు భంగం కలిగించాలని మంత్రులకు ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. తమ నియోజకవర్గాల్లో శాంతి సామరస్యాలను కాపాడాలని, ఎలాంటి అలజడులు లేకుండా చూడాలని కోరారు. జనవరి 22న జరిగే కార్యక్రమం తర్వాత అయోధ్యలోని తమ నియోజకవర్గాల్లోని స్థానిక ప్రజల సందర్శనకు ఏర్పాట్లు చేయాలని మంత్రులను కోరారు.
అరవింద్ కు బిగుస్తున్న ఉచ్చు: ఫార్మూలా ఈ-రేస్ కు రూ. 50 కోట్ల విడుదలపై మెమో జారీ
ఇదిలా ఉండగా.. జనవరి 22న అయోధ్యలోని రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. దీని కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రసారం చేయడంతో పాటు న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. దేశవిదేశాల్లోని రామభక్తులందరినీ ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.
నాలుగేళ్ల కొడుకును చంపి, బ్యాగులో కుక్కి తీసుకెళ్లిన స్టార్టప్ కంపెనీ సీఈవో.. ఎందుకలా చేసిందట అంటే..
అయోధ్యలోని రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు వారం ముందు జనవరి 16 న వైదిక ఆచారాలు ప్రారంభమవుతాయి. వారణాసికి చెందిన పూజారి లక్ష్మీకాంత్ దీక్షిత్ జనవరి 22న రామ్ లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ప్రధాన పూజలు నిర్వహించనున్నారు. జనవరి 14 నుంచి 22 వరకు అయోధ్యలో అమృత్ మహోత్సవ్ జరగనుంది. ఈ పవిత్ర కార్యంలో పాల్గొనాలని దేశవిదేశాలకు చెందిన పలువురు వీవీఐపీ అతిథులకు ఆహ్వానాలు అందాయి.