
మెక్సికోలోని సెంట్రల్ స్టేట్ గ్వానాజువాటోలోని ఓ బార్ లో కాల్పుల జరిగాయి. ఈ ఘటనలో దాదాపు పది మంది మరణించారు. ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ దాడిని స్థానిక అధికారులు ఆదివారం ధృవీకరించారు. మృతుల్లో ఏడుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. గ్వానాజువాటోలోని ‘ఎల్ ఎస్టాడియో’ బార్‌లో శనివారం స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11:00 గంటల తర్వాత కాల్పులు జరిగాయని వార్తా సంస్థ ‘ఏఎఫ్ పీ’ నివేదించింది. ఒకే సారి కొంత మంది వ్యక్తులు ఆయుధాలు పట్టుకొని వచ్చి ఈ దాడికి పాల్పడ్డారు.
సుత్తితో కొట్టి తండ్రిని చంపి తనయుడు.. మృతదేహాన్ని ముక్కలుగా నరికి..సూట్ కేసులో పెట్టి...
సెలయా, క్వెరెటారో నగరాలను కలిపే రహదారిపై ఉన్న ఈ బార్ లోని కస్టమర్లు, ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని దుండగులు దాడికి ఒడిగట్టారు. ఈ కాల్పులు జరిగిన బార్ మెక్సికో సెంట్రల్ స్టేట్ గ్వానాజువాటో అభివృద్ధి చెందిన పారిశ్రామిక ప్రాంతంగా ఉంది. ఇది మెక్సికోలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. అయితే ఇటీవలి కాలంలో దేశంలోనే అత్యంత రక్తపాత రాష్ట్రంగా మారింది.
శాంటా రోసా డి లిమా, జాలిస్కో న్యూవా జనరేషన్ అనే రెండు కార్టెల్‌లు సెంట్రల్ స్టేట్ గ్వానాజువాటోలో నివసిస్తున్నారు. అయితే వీరి యుద్ధానికి ఈ ప్రాంతం వేధికగా మారింది. వీరంతా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో నివసించే వ్యక్తులు ఎక్కువగా డ్రగ్ స్మగ్లింగ్, ఇంధన దొంగతనాలకు ప్రసిద్ధి చెందారు.
స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కుదరదు.. సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం
తాజాగా జర్మనీలోని హాంబర్గ్ నగరంలో చర్చిపై దాడి జరిగింది. ఈ ఘటనలో 24 మంది తీవ్రంగా గాయపడగా, ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. గ్రోస్‌బోర్‌స్టెల్ జిల్లాలోని డెల్‌బోజ్ స్ట్రీట్‌లోని చర్చిపై దుండగులు కాల్పులు జరిపారు.
మూడు రోజుల కిందట జర్మనీలో కూడా ఇలాంటి దాడే జరిగింది. హాంబర్గ్ నగరంలో ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఏడుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. అల్స్టర్‌డార్ఫ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని హాంబర్గ్ పోలీసులు చెప్పారు. జర్మనీ మీడియా నివేదిక ప్రకారం.. ఉత్తర జర్మనీలోని హాంబర్గ్ నగరంలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో దాదాపు ఏడుగురు మరణించగా, ఎనిమిది మంది గాయపడ్డారు.
మహిళను కిడ్నాప్, హత్య.. శరీరాన్ని ముక్కలుగా కోసి వేర్వేరు ప్రాంతాల్లో పడేసి..
అదే రోజు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌లో కూడా ఓ దుండగుడు ఇలాంటి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. అయితే ఈ ఉగ్రదాడితో అప్రమత్తమైన ఇజ్రాయెల్ పోలీసులు ముష్కరుడిని హతం చేశారు. దీనిని అనుమానాస్పద ఉగ్రవాదిగా భావిస్తున్నారు. ఈ ఘటనను అక్కడి ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.