ప్రియుడి సాయంతో మైన‌ర్ కొడుకు, కుమార్తెను చంపిన మహిళ

Published : Mar 25, 2023, 10:39 AM ISTUpdated : Mar 25, 2023, 10:54 AM IST
ప్రియుడి సాయంతో మైన‌ర్ కొడుకు, కుమార్తెను చంపిన మహిళ

సారాంశం

Meerut: ప్రియుడి సాయంతో మైనర్ కొడుకు, కుమార్తెను చంపింది ఒక మహిళ. ఈ దారుణానికి పాల్ప‌డిన త‌ర్వాత నిందితులు వారి మృతదేహాలను కాలువలో పడేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ షాకింగ్ ఘటన యూపీలో చోటుచేసుకుంది.   

Woman Kills Minor Son, Daughter: ఒక షాకింగ్ ఘ‌ట‌న తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. ప్రియుడి సాయంతో మైనర్ కొడుకు, కుమార్తెను చంపింది ఒక మహిళ. ఈ దారుణానికి పాల్ప‌డిన త‌ర్వాత నిందితులు వారి మృతదేహాలను కాలువలో పడేసినట్లు పోలీసులు తెలిపారు.  ఈ షాకింగ్ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో చోటుచేస‌కుంది. 

ఈ దారుణ ఘ‌ట‌న గురించి పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.. స్థానిక కౌన్సిలర్ అయిన తన ప్రియుడి సాయంతో ఓ మహిళ తన పదేళ్ల కొడుకు, ఆరేళ్ల కుమార్తెను హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లోని మీరట్ లో చోటుచేసుకుంది. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుందని ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు. పిల్లలను చంపిన తర్వాత వారి మృతదేహాలను స్థానికంగా ఉన్న ఒక కాలువ‌లో పడేశారు. ఈ కేసులో మహిళ ఇరుగుపొరుగు వారు కూడా సంబంధం క‌లిగి ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ రెండు హత్యలకు పాల్పడిన ఘ‌ట‌న‌లో నిందితులుగా ఉన్న‌ ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

చిన్నారుల మృతదేహాలు ఇంకా లభ్యం కాలేదు...

మార్చి 22న ఇద్దరు తోబుట్టువులు, పదేళ్ల బాలుడు, ఆరేళ్ల బాలికను హత్య చేసి వారి మృతదేహాలను వారి తల్లి, స్థానిక కౌన్సిలర్ సౌద్ అనే ప్రియుడు ఇరుగుపొరుగు వారి సహాయంతో కాలువలో పడేశారు. పిల్లలు కనిపించకుండా పోవడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా కుట్ర బయటపడిందని మీర‌ట్ నగర ఎస్పీ పీయూష్ సింగ్ తెలిపారు.ఈ హత్యల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు పాల్గొన్నారు. బాలికను సొంత ఇంట్లోనే, అబ్బాయిని పక్కింట్లో హత్య చేశారు. చిన్నారుల మృతదేహాలు ఇంకా లభ్యం కాలేద‌నీ పోలీసులు తెలిపారు. నిందితులందరినీ అరెస్టు చేశామనీ, తదుపరి దర్యాప్తు కొనసాగుతోంద‌ని ఎస్పీ చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !
Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే