షాకింగ్ : స్మశానంలో అంత్యక్రియలు చేస్తుండగా లేచిన చిన్నారి...

Published : Aug 19, 2023, 02:36 PM IST
షాకింగ్ : స్మశానంలో అంత్యక్రియలు చేస్తుండగా లేచిన చిన్నారి...

సారాంశం

చనిపోయిందని అంత్యక్రియలు చేస్తున్న సమయంలో ఎనిమిదినెలల చిన్నారిలో కదలికలు వచ్చాయి. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా బతికింది. ఈ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. 

కర్ణాటక : ఒక్కోసారి అనుకోని మిరాకిల్స్ జరుగుతుంటాయి. చనిపోయారనుకున్న వ్యక్తులు తిరిగి బతుకుతుంటారు. అది పొరపాటో, ఆస్పత్రి వర్గాల నిర్లక్ష్యమో కానీ.. ఆ కుటుంబం పాలిట అద్భుతంగా మారుతుంది ఆ ఘటన. అలాంటి ఘటనే కర్ణాటకలో వెలుగు చూసింది. 8 నెలల చిన్నారి అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స అందించిన వైద్యులు ఆ చిన్నారి చనిపోయిందని తెలిపి తల్లిదండ్రులకు అప్పచెప్పారు.  

తమ కలల పంట కళ్ళముందే కన్నుమూయడంతో తట్టుకోలేకపోయిన ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. చిన్నారిని అంత్యక్రియల కోసం స్మశానానికి తీసుకువెళ్లారు.  స్మశానానికి తీసుకు వెళుతుండగా దారిలో చిన్నారులు కదలికలు కనిపించాయి. దీంతో షాక్కుకు గురైన తల్లిదండ్రులు వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చిన్నారిని పరీక్షించిన వైద్యులు 90% నాడి కొట్టుకుంటుందని గుర్తించారు.  

పరువుహత్య : కన్నకూతురిని దారుణం హతమార్చిన తల్లిదండ్రులు.. పథకం అంతా అన్నదే...

వెంటనే చికిత్స ప్రారంభించారు. ఈ ఘటన  కర్ణాటకలోని ధార్వాడ జిల్లా నవలగుంద తాలూకా బసాపురం గ్రామంలో చోటుచేసుకుంది. ఈ గ్రామానికి చెందిన బసప్ప పూజార్ కు  ఎనిమిది నెలల వయసున్న కుమారుడు  ఉన్నాడు. ఆ చిన్నారికి ఉన్నట్టుండి ఊపిరి సరిగా ఆడక పోవడంతో హుబ్లీలోని కిమ్స్ లో చేర్పించారు. అక్కడ వైద్యులు నాలుగు రోజులపాటు చిన్నారికి వైద్యం అందించారు.  

గురువారం సాయంత్రం.. చిన్నారికి పల్స్ రేటు చాలా తక్కువగా ఉందని.. ఆక్సిజన్ తీసేస్తే చిన్నారి బతకదని తెలిపారు. ఆ తర్వాత కాసేపటికి చిన్నారి చనిపోయిందంటూ తల్లిదండ్రులతో అవసరమైన పత్రాలపై సంతకాలు తీసుకుని చిన్నారిని అప్పగించారు. తీవ్రశోకంలో మునిగిపోయిన తల్లిదండ్రులు చిన్నారికి అంత్యక్రియలు చేయడం కోసం స్మశానానికి తీసుకువెళ్లారు.  

అంత్య క్రియల్లో భాగంగా చిన్నారి నోట్లో పసుపు నీరు  పోశారు. ఆ సమయంలో ఆశ్చర్యంగా ఆ బాలుడు కాళ్లు, చేతులు ఆడించాడు. అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. చిన్నారి చనిపోలేదని గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే బాబును తీసుకొని  నవలగుంద ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ  చికిత్స అందించిన తర్వాత ధార్వాడ సివిల్ ఆసుపత్రికి పంపించారు.  

నవలగుంద తాలూకా ఆసుపత్రిలో ఆ చిన్నారికి వైద్యం చేసిన డాక్టర్ వై.విద్య మాట్లాడుతూ.. బిడ్డ 90% వేరకు ఆరోగ్యంగానే ఉందని చెప్పారు.  అలాంటి బిడ్డను చనిపోయిందంటూ ఎలా నిర్ధారించారని కిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ్ కుమార్ ను వివరణ కోరగా…బిడ్డ విషయంలో కేస్ ఫైల్ ను, ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను  పూర్తిగా పరిశీలించి తెలుసుకున్న తర్వాతే  దీనిమీద మాట్లాడతానని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌