
భారత్, పాకిస్దాన్ దేశాల మధ్య స్నేహం బంధం బలపడేలా లేదు. ఈ ప్రపంచంలో ఇతర శత్రు దేశాలు కలిసిపోయినా.. ఈ రెండు దేశాలు తమ శత్రుత్వాన్ని మరచిపోతాయి కావచ్చు. దాయాది దేశం పాకిస్థాన్ మరోసారి తన కుటిల బుద్దిని ప్రదర్శించింది. కాశ్మీర్ సమస్యను సజీవంగా ఉంచడానికి మరో నాటకానికి తెర తీసింది. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ రద్దు కావడంతో ఆపద్ధర్మ ప్రధానిగా అన్వరుల్ హక్ కాకర్‌ను నియమించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో తన మంత్రివర్గాన్ని ఏర్పాటుచేసుకున్నారు. ఇక్కడ వరకు బాగున్న పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధాని ఓ నీచపు చర్యకు తెరతీశాడు.
18 మందితో కొలువుదీరిన తన తాత్కాలిక మంత్రివర్గంలో 16 మంది ఫెడరల్ మంత్రులు ఉండగా.. మరో ముగ్గురు సలహాదారులు ఉన్నారు. అయితే..ఈ ముగ్గురు సలహాదారుల్లో కశ్మీర్ వేర్పాటువాద నేత, ఉగ్రవాది యాసీన్ మాలిక్ భార్య ముషాల్ హుస్సేన్ మాలిక్‌ను కూడా ఉంది. మన దేశంలో బంధీగా ఉన్న యాసీన్ మాలిక్.. హత్య, టెర్రర్ ఫండింగ్, మొదలైన వాటిపై విచారణను ఎదుర్కొంటున్నారు. అలాంటి ఉగ్రవాది భార్య ముషాల్ హుస్సేన్ మాలిక్‌ను ఇన్‌ఛార్జ్ మంత్రిగా నియమించుకున్నారు.
పాకిస్థాన్ తాత్కాలిక మంత్రివర్గంలో 18 మంది సభ్యులతో కలిసి ముషాల్ కూడా ప్రమాణం చేశారు. అయితే.. ఆమె ద్వంద్వ జాతీయత కారణంగా.. ముషాల్ పూర్తి స్థాయి మంత్రిగా ఉండరు, కానీ ఆపద్ధర్మ ప్రధాని అన్వరుల్ హక్ కాకర్‌కు మానవ హక్కుల సమస్యలపై ప్రత్యేక సలహాదారుగా పనిచేస్తారని పాకిస్తాన్ మీడియా తెలిపింది. పాకిస్థాన్‌లో పాకిస్థానీయుడు మాత్రమే పూర్తికాల మంత్రి కాగలడు.
ముషాల్ హుస్సేన్ మాలిక్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. కశ్మీర్‌లో మానవ హక్కులపై ఆమె సోషల్ మీడియా ద్వారా భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ అసెంబ్లీలో ప్రసంగించేందుకు ఆమె తన 11 ఏళ్ల కుమార్తెను కూడా అనుమతించింది. ఆ యువతి భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడింది. కశ్మీర్‌ను ముస్లింలకు ఉద్దేశించినట్లుగా కరీఫ్‌లు ఉంచలేరని చెప్పింది. ముషాల్ మాలిక్ తన భర్తను జైలు నుండి విడుదల చేయాలని కోరుతూ.. భారత ప్రభుత్వం అతనిని చంపడానికి కుట్ర పన్నిందని ఆరోపించింది.
నిషేధిత ఉగ్రవాద సంస్థ జమ్మూ-కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్‌ఎఫ్) చీఫ్‌గా పనిచేసిన యాసిన్ మాలిక్ ఉగ్రవాదులకు నిధులు అందజేశారన్న నేరంతో పాటు.. నలుగురు భారత వైమానిక దళ అధికారులను హత్య చేయడం , డాక్టర్ రూబియా సయీద్‌ను అపహరించడం వంటి తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఒక కేసులో కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు.
పాకిస్తాన్ ప్రభుత్వం తన తాత్కాలిక మంత్రివర్గంలోకి ముషాల్ మాలిక్‌ను తీసుకోవడం ద్వారా.. కాశ్మీర్ సమస్యను మరోసారి లెవనెత్తనున్నట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ కాశ్మీర్ అధ్యాయాన్ని మూసివేయడంపై దేశీయ విమర్శలను పరిష్కరించడానికి కూడా ప్రయత్నిస్తోంది. కశ్మీర్ వేర్పాటు ఉద్యమ మద్దతు కోసం 2005లో ఇస్లామాబాద్ వెళ్లిన యాసిన్‌కు అక్కడ పాక్ చెందిన ముషాల్ పరిచయం అయ్యారు. ఆయన ప్రసంగానికి ఆకర్షితురాలై ఆమె ప్రేమలో పడ్డారు. వారి వివాహం 2009లో జరిగింది.
ప్రస్తుతం ముషాల్ హుస్సేన్ మాలిక్,ఆమె కుమార్తె రజియా సుల్తాన్ పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో నివసిస్తున్నారు. ముషాల్ శక్తివంతమైన రాజకీయ కుటుంబానికి చెందింది. ఆమె తల్లి రెహమా హుస్సేన్ మాలిక్ PML(N) నాయకురాలు, అలాగే ఆమె తండ్రి MA హుస్సేన్ మాలిక్ ప్రఖ్యాత ఆర్థికవేత్త. ఈ నియామకం ముషాల్ యొక్క ప్రతిష్టను పెంచుతుంది. కాశ్మీర్ కోసం తాము సేవ చేస్తున్నామని పాకిస్థానీలను నమ్మేలా చేస్తుంది.