దావుద్ ఇబ్రహీంకు షాక్.. ఆస్తులను వేలం వేసేందుకు సిద్ధమైన భారత ప్రభుత్వం..

By Sairam Indur  |  First Published Dec 25, 2023, 2:51 PM IST

Dawood Ibrahim : అండర్ వరల్డ్ డాన్ కు సంబంధించిన ఆస్తులను భారత ప్రభుత్వం వేసేందుకు సిద్ధమయ్యింది. ముంబై, రత్నగిరిలో ఉన్న అతడి ఆస్తులను వచ్చే ఏడాది జనవరిలో వేలం వేయాలని నిర్ణయించింది.


Dawood Ibrahim : ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రదారి, అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీంకు సంబంధించిన ఆస్తులను కేంద్ర ప్రభుత్వం వేలం వేసేందుకు వేయనుంది. మహారాష్ట్రలోని ముంబై, రత్నగిరిలోని ఖేడ్ తాలూకాలో ఉన్న బంగ్లాలు, మామిడి తోటలతో సహా నాలుగు ఆస్తులను స్మగ్లర్లు, విదేశీ మారక ద్రవ్య చట్టం (సఫ్మా) కింద గతంలో అధికారులు సీజ్ చేశారు. వాటిని 2024 జనవరి 5వ తేదీన వేలం వేయాలని నిర్ణయించింది.

సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తాం.. స్థలం, రూ.20 లక్షల లోన్ ఇస్తాం - మంత్రి పొంగులేటి..

Latest Videos

కాగా.. గతంలో కూడా దావుద్ ఇబ్రహీం కుటుంబానికి సంబంధించిన పలు ఆస్తులను ప్రభుత్వం వేలం వేసింది. అతడి సంబంధీకులకు చెందిన ఓ రెస్టారెంట్ ను రూ.4.53 కోట్లకు, ఆరు ఫ్లాట్లను రూ.3.53 కోట్లకు, ఒక గెస్ట్ హౌస్ ను రూ.3.52 కోట్లకు విక్రయించారు. 2020 డిసెంబర్ లో కూడా రత్నగిరిలోని అతడి ఆస్తులను వేలం వేయగా.. రూ.1.10 కోట్లు వచ్చాయి.

పాతబస్తే అసలైన హైదరాబాద్.. హైకోర్టును అక్కడి నుంచి తరలించొద్దు - అసదుద్దీన్ ఒవైసీ..

ఇదిలా ఉండగా.. దావూద్ ఇబ్రహీంపై విష ప్రయోగం జరిగిందని, అతడు పాకిస్థాన్ లోని కరాచీ ఆసుపత్రిలో మరణించాడని ఇటీవల వార్తలు బయటకువ వచ్చాయి. అయితే వాటిని దావుద్ సన్నిహితుడు చోటా షకీల్ కొట్టిపారేశారు. అండర్ వరల్డ్ డాన్ బతికే ఉన్నాడని చెప్పారు. దావుద్ ఇబ్రహీం 1000 శాతం ఫిట్ గా ఉన్నాడని షకీల్ తెలిపారు. నిరాధారమైన పుకార్లను కొట్టిపారేశారు. విషప్రయోగం జరిగిందన్న వదంతులను ఆయన ఖండించారు.

1993లో 250 మందిని పొట్టనబెట్టుకుని, వేలాది మందిని గాయపరిచిన ముంబై పేలుళ్ల సూత్రధారిగా ఉన్న దావూద్ ఇబ్రహీం గత దశాబ్దాలుగా పాకిస్థాన్ లోనే ఉంటున్నాడు. అతడు కరాచీలోని అప్ మార్కెట్ క్లిఫ్టన్ ప్రాంతంలో నివసిస్తున్నాడని భారత అధికారులు భావిస్తున్నారు. అయితే దీనిని పాకిస్తాన్ దీనిని ఖండిస్తూ వస్తోంది.

హిందీ మాట్లాడే వారు తమిళనాడులో టాయిలెట్లు కడుగుతారు - డీఎంకే నేత దయానిధి వివాదాస్పద వ్యాఖ్యలు

దావూద్ ఇబ్రహీం దేశం బయట తలదాచుకుంటున్నప్పటికీ.. ముంబైలో నేర కార్యకలాపాలను నియంత్రిస్తున్నాడని అధికారులు భావిస్తున్నారు. పాకిస్తాన్ లో అతడు మజాబిన్ అనే పాకిస్తానీ పఠాన్ ను వివాహం చేసుకున్నాడని, అతడకి ముగ్గురు మరుఖ్, మెహ్రిన్, మాజియా, మోహిన్ నవాజ్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలుస్తోంది.

click me!