పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా విడాకులు కన్ఫామ్ (Sania Mirza confirms divorce with Shoaib Malik) అయ్యాయి. ఈ విషయాన్ని సానియా కుటుంబం కూడా నిర్ధారించింది. కొత్త జంటకు ఆమె విషెష్ కూడా తెలిపిందని ఆ కుటుంబం సోషల్ మీడియా పోస్ట్ లో తెలిపింది.
Sania Mirza : భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. వారిద్దరూ విడాకులు తీసుకున్నారని షోయబ్ మాలిక్ శనివారం తన సోషల్ మీడియా హ్యాండిల్ లో పోస్ట్ చేసిన ఫొటోల్లో తేలిపోయింది. అయితే ఈ విడాకులను సానియా మీర్జా కుటుంబం ఆదివారం నిర్ధారించింది.
అయోధ్యకు, ధనుష్కోడికి మధ్య సంబంధం ఏంటి ? ప్రధాని అక్కడ పూజలెందుకు చేశారు ? (ఫొటోలు)
సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా తన ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ ద్వారా విడాకులను ధ్రువీకరించారు. ‘‘ సానియా ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితాన్ని ప్రజలకు దూరంగా ఉంచుతుంది. షోయబ్, ఆమె విడాకులు తీసుకుని కొన్ని నెలలు అవుతోంది. అయతే ఈ విషయాన్ని ఆమె ఈ రోజు షేర్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. షోయబ్ కొత్త ప్రయాణానికి ఆమె శుభాకాంక్షలు తెలిపింది!’’ అని మీర్జా కుటుంబంలో ఆ పోస్ట్ ద్వారా ప్రకటించింది.
‘‘ఆమె జీవితంలోని ఈ సున్నితమైన సమయంలో, అభిమానులు మరియు శ్రేయోభిలాషులందరూ ఎలాంటి ఊహాగానాలకు పాల్పడవద్దని, ఆమె గోప్యత అవసరాన్ని గౌరవించాలని మేము కోరుతున్నాము’’ అని పోస్ట్ పేర్కొంది.
2010 ఏప్రిల్ లో భారత టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా హైదరాబాద్ లో షోయబ్ మాలిక్ ను పెళ్లి చేసుకుంది. వీరికి ఐదేళ్ల కుమారుడు ఇజాన్ ఉన్నాడు. ఆ బాబు ప్రస్తుతం మీర్జాతో నివసిస్తున్నాడు. అయితే చాలా కాలంగా ఈ జంట విడిపోబోతున్నారంటూ ఊహాగానాలు వస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. సానియా మీర్జా ఇండియాలోనే నివసిస్తుండటం, ఆమె సోషల్ మీడియా పోస్టులు, అలాగే షోయబ్ మాలిక్ ఖాన్ పోస్టులు వారి విడాకుల వార్తలను బలపరుస్తూ వచ్చాయి.
రామభక్తుడిగా అసదుద్దీన్ ఓవైసి ... రామనామ స్మరణ తప్పదు..: విహెచ్‌పి నేత సంచలనం
ఇటీవల మీర్జా తన ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ లో కూడా విడాలకల విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. అందులో ‘‘పెళ్లి కష్టమే. విడాకులు కష్టమే.. మీ కష్టాన్ని ఎంపిక చేసుకోండి.. ఊబకాయం కష్టం, ఫిట్ గా ఉండటం కష్టం. మీ కష్టాన్ని ఎంపిక చేసుకోండి. అప్పుల ఊబిలో కూరుకుపోవడం కష్టం. ఆర్థికంగా క్రమశిక్షణతో ఉండటం కష్టం. మీ కష్టాన్ని ఎంపిక చేసుకోండి. కమ్యూనికేషన్ చాలా కష్టం. కమ్యూనికేట్ చేయకపోవడం కష్టం. మీ కష్టాన్ని ఎంపిక చేసుకోండి. జీవితం ఎప్పటికీ సులభం కాదు. ఇది ఎప్పుడూ కష్టంగా ఉంటుంది. కానీ మన కష్టాన్ని మనం ఎంచుకోవచ్చు. తెలివిగా ఎంచుకోండి’’ అని సానియా మీర్జా షేర్ చేసిన కోట్ లో పేర్కొన్నారు.
41 ఏళ్ల మాలిక్ శనివారం సనాతో తన పెళ్లి ఫొటోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. అయితే ఆమెకు అది రెండో పెళ్లి కాగా.. షోయబ్ మాలిక్ మూడో పెళ్లి. షోయబ్ మాలిక్-సనా జావేద్ వివాహా ఫొటోలను పంచుకుంటూ.. "అల్హమ్‌దుల్లిలాహ్.. మేము మిమ్మల్ని జంటలుగా సృష్టించామ" అని క్యాప్షన్ తో సోయబ్ మాలిక్ పేర్కొన్నాడు. ఈ ఫొటోల వల్ల సానియా-షోయబ్ విడాకులు కన్ఫామ్ అని సోషల్ మీడియాలో చర్చ జరిగింది.