ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి సానియా వివరాలు తొలగించిన షోయబ్‌ మాలిక్.. మళ్లీ మొదలైన విడాకుల ఊహాగానాలు..

Published : Aug 05, 2023, 10:11 AM IST
 ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి సానియా వివరాలు తొలగించిన షోయబ్‌ మాలిక్.. మళ్లీ మొదలైన విడాకుల ఊహాగానాలు..

సారాంశం

షోయబ్ మాలిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్ నుంచి భార్య సానియా మీర్జా వివరాలను తొలగించారు. దీంతో ఈ దంపతులిద్దరూ విడాకులు తీసుకోబుతున్నారని సోషల్ మీడియాలో చర్చ మళ్లీ మొదలైంది.

పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్‌ మాలిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ నుంచి తన భార్య, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కు సంబంధించిన వివరాలు తొలగించారు. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ ఊహగానాలు మళ్లీ మొదలయ్యాయి. దాదాపు ఏడాది కాలంగా ఈ దంపతులు విడాకులు తీసుకోబోతున్నారని సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ సాగుతోంది. అయితే దీనిపై ఇద్దరూ ఇప్పటి వరకు ఎలాంటి కామెంటూ చేయలేదు. ఆ ఊహాగానాలు కొనసాగుతున్న సమయంలోనే ఈ దంపతులిద్దరూ పాకిస్థాన్ లో జరిగిన ఓ రియాల్టీ షో కు హోస్ట్ గా వ్యవహరించారు.

ఉగ్రవాదులతో ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్ల మృతి.. కాశ్మీర్ లోని కుల్గాంలో ఘటన.. 

2010లో పాకిస్థాన్ క్రికెటర్ అయిన షోయబ్‌ మాలిక్ తో సానియా మీర్జా కు వివాహం జరిగింది. వీరికి ప్రస్తుతం ఇజ్‌హాన్‌ మాలిక్‌ అనే కుమారుడు ఉన్నాడు. కాగా.. తాజాగా షోయబ్‌.. సానియా వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి తొలగించడం మళ్లీ చర్చనీయాంశం అయ్యింది. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

గతంలో షోయబ్‌ బయోలో సూపర్‌ వుమన్‌ సానియా మీర్జా భర్త అని రాసి ఉండేది. కానీ దానిని తాజాగా తొలగించాడు. అలాగే సానియా మీర్జా కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్ నుంచి భర్త ఫొటోలను తీసేసింది. ఈ పరిణామాలపై సానియా కుటుంబ సభ్యులు స్పందించారు. షోయబ్‌, సానియా మీర్జా ఇద్దరూ తమ వ్యక్తిగత జీవితంలో జరిగే విషయాలను గోప్యంగా ఉంచాలని భావిస్తున్నారని పేర్కొన్నారు. అందరూ దానిని గౌరవిస్తారని అనుకుంటున్నామని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..