
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి, సమాజంలో ఎలా నడుచుకోవాలో చెప్పే వృత్తిలో ఉన్న ఓ వ్యక్తి నీఛంగా ప్రవర్తించాడు. ఓ స్కూల్ ప్రిన్సిపాల్ తన విద్యార్థినిపై అత్యారానికి ఒడిగట్టాడు. ఉదయం సమయంలోనే తన గదికి తీసుకెళ్లి పదేళ్ల బాలికపై తన కామవాంఛ తీర్చుకున్నాడు. ఆ బాలికను అత్యాచారం చేశాడు. అనంతరం బాధితురాలికి కేక్ తినిపించి పంపించాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో చోటు చేసుకుంది.
మద్యం తాగేందుకు పెన్షన్ డబ్బులివ్వాలని తండ్రితో గొడవ.. రూ.100 ఇవ్వలేదని హత్య..
వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరులోని వర్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్ లో డిస్లెక్సియా (చదవడం, రాయడంలో ఇబ్బంది) బాధపడుతున్న ఓ బాలిక చదువుతోంది. ఎప్పటిలాగే గురువారం కూడా ఆ బాలిక స్కూల్ కు వెళ్లింది. తన తరగతి గదిలో కూర్చుంది. ఈ క్రమంలో 65 ఏళ్ల ప్రిన్సిపాల్ ఆ బాలిక దగ్గరికి వచ్చాడు. ఆమెను ప్రలోభాలకు గురిచేసి తన గదికి తీసుకెళ్లాడు.
కొత్త కారు కొన్నందుకు స్నేహితులకు పార్టీ.. తిరిగి వస్తుండగా ప్రమాదం.. ముగ్గురి మృతి.. అనంతపురంలో ఘటన
అనంతరం ఆ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఉదయం 11.30 గంటల సమయంలో జరిగింది. అనంతరం బాలికకు కేక్ ఇచ్చి, అక్కడే తినిపించి బయటకు పంపించాడు. స్కూల్ అయిపోయిన తరువాత బాలిక ఇంటికి వచ్చిన తరువాత కడుపు నొప్పితో బాధపడింది. దీంతో ఏం జరిగిందని తల్లి ఆరా తీయడంతో తనపై జరిగిన అఘాయిత్యాన్ని బాలిక వివరించింది.
వెంటనే తల్లి ఆ బాలికను సమీపంలోని హాస్పిటల్ కు తీసుకెళ్లింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో ఈ ఘటనకు సంబంధించి పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్లు, ఐపీసీ 376 (అత్యాచారం) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం ప్రిన్సిపాల్ ను అరెస్టు చేశారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.