నన్ను విమర్శించిన వారికి ఉన్నత పదవులు... ఏం జరిగినా యాత్ర ఆగదు: నారాయణ్ రాణే

By Siva KodatiFirst Published Aug 29, 2021, 8:06 PM IST
Highlights

తన జన ఆశీర్వాద్‌ యాత్రను కొనసాగిస్తానని.. మహారాష్ట్రలోని ప్రతి ఒక్క జిల్లాలో పర్యటిస్తాని కేంద్ర మంత్రి నారాయణ్ రాణే స్పష్టం చేశారు. కేంద్రం అందించే పథకాలను ప్రజలకు వివరిస్తాని.. బీజేపీలో చేరాలనుకునే వారిని స్వాగతించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటా అని కేంద్ర మంత్రి తెలిపారు.   
 

శివసేన పార్టీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేపై మరోసారి విరుచుకుపడ్డారు కేంద్ర మంత్రి నారాయణ్ రాణే.  రాష్ట్రంలో చేపడుతున్న జన ఆశీర్వాద్‌ యాత్రకు భంగం కలిగించడానికే తనను అరెస్టు చేయించారని ఆయన ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని ప్రోత్సహిస్తూ శివసేన ఉన్నత పదవులు కట్టబెడుతోందని రాణే ఎద్దేవా చేశారు. జన ఆశీర్వాద్‌ యాత్రలో ఒక చెడ్డ శకునం.. తమను తాము రాష్ట్రపతిగా ఊహించుకొనే కొందరు మంత్రులు తనను అరెస్టు చేయాలని ఆదేశించారంటూ ఆరోపించారు. 

తన యాత్రను కొనసాగిస్తానని.. మహారాష్ట్రలోని ప్రతి ఒక్క జిల్లాలో పర్యటిస్తాని నారాయణ్ రాణే స్పష్టం చేశారు. కేంద్రం అందించే పథకాలను ప్రజలకు వివరిస్తాని.. బీజేపీలో చేరాలనుకునే వారిని స్వాగతించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటా అని కేంద్ర మంత్రి తెలిపారు.  

ALso Read:మహారాష్ట్ర సీఎంపై అనుచిత వ్యాఖ్యలు: పోలీసుల అదుపులో కేంద్ర మంత్రి నారాయణ్ రాణే 

దేశ ప్రధాని ఆలోచన నుంచి పుట్టిందే జన ఆశీర్వాద్‌ యాత్ర అని... ఆయన తనకు కేబినేట్‌ పదవిని ఇచ్చి ప్రజల ఆశీర్వాదం తీసుకోమన్నారని నారాయణ్ రాణే అన్నారు. ముంబయి నుంచి చేపట్టిన యాత్ర పదో రోజు కొనసాగుతోందని.. ఈ రోజు తాను సింధుదుర్గ్‌లో ఉన్నానని ఆయన తెలిపారు. ఇప్పటికీ కొంతమంది ఈ యాత్రను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని.. అయినా కొన్ని వేల మంది జనం తనతో కలిసి వస్తున్నారు అని రాణే పేర్కొన్నారు. సీఎంకు స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేళ్లయిందో కూడా తెలియదని, అలాంటి వ్యక్తి చెంప పగలగొట్టాలంటూ నారాయణ్ రాణే చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలో తీవ్ర దుమారానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకుగానూ రత్నగిరి పర్యటనలో ఉన్న ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.

click me!