చెంప దెబ్బ రాజకీయం: నారాయణ రాణే అరెస్ట్‌... బీజేపీ-శివసేనల మధ్య మాటల యుద్ధం

By Siva KodatiFirst Published Aug 24, 2021, 7:38 PM IST
Highlights

కేంద్ర మంత్రి నారాయణ రాణే అరెస్ట్ నేపథ్యంలో బీజేపీ-శివసేన కార్యకర్తల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేంద్ర మంత్రి మానసిక పరిస్ధితి సరిగా లేదని శివసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు బీజేపీ శ్రేణులు సైతం ఆందోళన చేయడంతో ఇరు వర్గాల మధ్య పోటాపోటీ నిరసన కార్యక్రమాలు చోటు చేసుకోవడంతో ముంబైలో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి

కేంద్ర మంత్రి నారాయణ రాణే అరెస్ట్ నేపథ్యంలో బీజేపీ-శివసేన కార్యకర్తల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేంద్ర మంత్రి మానసిక పరిస్ధితి సరిగా లేదని శివసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు బీజేపీ శ్రేణులు సైతం ఆందోళన చేయడంతో ఇరు వర్గాల మధ్య పోటాపోటీ నిరసన కార్యక్రమాలు చోటు చేసుకోవడంతో ముంబైలో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. అయితే తన అరెస్ట్ అక్రమం  అన్నారు కేంద్ర మంత్రి నారాయణ రాణే. తానెలాంటి తప్పు చేయలేదని చెప్పారు. మహారాష్ట్ర పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితోనే తనను అరెస్ట్ చేశారన్నారు. మహారాష్ట్రలో రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగుతుందన్నారు కేంద్ర మంత్రి. అటు రాణే అరెస్ట్‌లో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రోటకాల్‌ను ఉల్లంఘించిందని  రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ ఆరోపించారు. 

Also Read:మహారాష్ట్ర సీఎంపై అనుచిత వ్యాఖ్యలు: పోలీసుల అదుపులో కేంద్ర మంత్రి నారాయణ్ రాణే

ముంబైలోని జుహులోని  మంత్రి నారాయణ్ రాణే నివాసం వెలుపల శివసేన సభ్యులు ఇవాళ నిరసనకు దిగారు. కేంద్ర మంత్ర రాణే మద్దతుదారులు, శివసేన సభ్యులు జుహులో ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో ఇద్దరు గాయపడ్డారు. కేంద్ర మంత్రి ఇంటిపై సిరా, గుడ్లను విసిరారు శివసేన సభ్యులు. మలాడ్ ఈస్ట్ లో రాణేకు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు ఆందోళనలు చేశారు. ఈ సమయంలో పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జీ చేశారు. 

రత్నగిరి జిల్లాలో జన ఆశీర్వాద యాత్ర సందర్భంగా సీఎం  ఉద్దవ్ ఠాక్రేపై కేంద్ర మంత్రి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనపై నమోదైన మూడు ఎఫ్ఐఆర్‌లను కొట్టివేయాలని కోరుతూ ఆయన ముంబై హైకోర్టును ఆశ్రయించారు. మహద్, పుణే, నాసిక్ లలో మూడు ఎఫ్ఐఆర్ లను రద్దు చేయాలని ఆయన కోరారు.తనను అరెస్ట్ చేయవద్దని కూడ ఆ పిటిషన్ లో ఆయన కోరారు. అత్యవసరంగా ఈ విషయమై విచారణను కోరారు .

click me!