జపాన్ మాజీ ప్రధాని హత్య కు గురైన నేపథ్యంలో నేడు భారత దేశ సంతాప దినంగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో దేశ వ్యాప్తంగా ప్రతీరోజు ఎగిరే జాతీయ జెండాలు కొంచెం కిందకి దించనున్నారు.
జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు నివాళులర్పిస్తూ భారతదేశం నేడు సంతాప దినాన్ని ప్రకటించింది. దీంతో ఎర్రకోట, రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ వద్ద జాతీయ జెండాలను కిందకి దించారు. జపాన్‌లో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన 67 ఏళ్ల అబే.. పశ్చిమ జపాన్‌లోని నారా పట్టణంలో తన పార్టీ తరపున ప్రచారం చేస్తున్న సమయంలో హత్యకు గురయ్యారు.
ప్రియుడి మీద ప్రేమ.. భర్తను విషం పెట్టి చంపి, గుండెపోటు అని కలరింగ్.. చివరికి...
అత్యవసర చికిత్స కోసం ఆయనను హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలించినప్పటికీ పరిస్థితి విషమించి మృతి చెందాడు. శ్వాస తీసుకోవడం, గుండె ఆగిపోవడంతో ఆయన చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆయన మృతి పట్ల దేశంలోని ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.“ షింజో అబే ఇక లేడని నమ్మడం నాకు కష్టంగా ఉంది. ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడు. ఆయన స్నేహతత్వం ప్రపంచ వ్యాప్తంగా అందరికీ నచ్చింది. అబె దుండగుల బుల్లెట్‌లకు బలి కావడం యావత్ మానవాళికి విషాదం. ఆయన కుటుంబానికి, జపాన్ ప్రజలకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను ’’ అని రాష్ట్రపతి కోవింద్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
Ex-Japan PM: హత్యకు గురైన దేశాధినేతలు, ప్రపంచ నాయకులు వీరే.. ఇందిరా గాంధీ నుంచి షింజో వరకు..
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఏడాది మేలో తన జపాన్ పర్యటన సందర్భంగా చివరిసారిగా కలిసిన అబేతో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని మోదీ, ఆయన ఒక మహోన్నతమైన ప్రపంచ రాజనీతిజ్ఞుడని, అత్యుత్తమ నాయకుడని, తన జీవితాన్ని జపాన్, ప్రపంచాన్ని తయారు చేసేందుకు అంకితం చేసిన అద్భుతమైన పరిపాలకుడని అన్నారు. అబేను తన ప్రియమైన మిత్రుడిగా అభివర్ణించిన ప్రధాని మోడీ, భారతదేశం లోతైన గౌరవానికి గుర్తుగా, జూలై 9న ఒకరోజు జాతీయ సంతాపాన్ని పాటిస్తామని తెలిపారు.
ఈ మేరకు ట్విట్టర్‌లో ఉద్వేగభరితమైన ప్రధాని మోడీ ఒక ఉద్వేగభరితమైన పోస్ట్ పెట్టారు. తమ పర్యటనలో అబే తనతో అనేక విషయాలు చర్చించారని, అయితే అదే చివరి సమావేశం అని నాకు తెలియదు అని ట్వీట్ చేశారు. “ మిస్టర్ అబేతో నా అనుబంధం చాలా సంవత్సరాల నాటిది. నేను గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో ఆయనతో నాకు పరిచయం ఏర్పడింది. నేను ప్రధాని అయిన తర్వాత మా స్నేహం కొనసాగింది. ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ వ్యవహారాలపై ఆయనకున్న పదునైన అంతర్దృష్టి ఎప్పుడూ నాపై లోతైన ముద్ర వేసింది” అని ప్రధాన మంత్రి అన్నారు.
Maharashtra Politics: "పార్టీని అంతం చేయాలని భావిస్తుంది" .. బీజేపీపై సంజయ్ రౌత్ ఆగ్రహం
టోక్యోలో ఇటీవల జరిగిన తన సమావేశంలో అబేతో ఉన్న ఒక ఫొటోను షేర్ చేస్తూ ‘‘ భారత్-జపాన్ సంబంధాలను బలోపేతం చేయడంపై ఎప్పుడూ మక్కువ కలిగి ఉన్న ఆయన జపాన్-ఇండియా అసోసియేషన్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు" అని అని పేర్కొన్నారు. కాగా అబే జపాన్-భారత్ సంబంధాలను పెంపొందించుకున్నారు. ప్రధాని మోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌లతో గొప్ప అనుబంధాన్ని కల్గి ఉన్నారు. 2014లో ప్రధాని మోదీ జపాన్ పర్యటన సందర్భంగా ఇరు పక్షాలు ‘ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యానికి’ సంబంధాన్ని అప్‌గ్రేడ్ చేశాయి.