ప్రియుడి మీద ప్రేమ.. భర్తను విషం పెట్టి చంపి, గుండెపోటు అని కలరింగ్.. చివరికి...

By SumaBala Bukka  |  First Published Jul 9, 2022, 8:14 AM IST

కర్ణాటకలోని మైసూరులో దారుణం జరిగింది. ప్రియుడి మీది మోజులో భర్తను విషం పెట్టి చంపింది ఓ ఇల్లాలు. ఆ తరువాత గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది. 


మైసూరు : ఓ వివాహిత ప్రియుడి మోజులో పడింది. ఆ మాయ కళ్లను కమ్మేయడంతో కట్టుకున్న భర్తకే విషయం పెట్టి చంపేసింది. దాచాలనుకున్నా ఇలాంటి నేరాలు దాగవు.. దీంతో విషయం వెలుగులోకి రావడంతో సదరు నిందితురాలిని, ఆమెకు సహకరించిన ప్రియుడినీ అరెస్ట్ చేసి జైలుకు పంపారు పోలీసులు. హెచ్.డి. కోటై తాలూకా, అగసనహుండి గ్రామానికి చెందిన కెంపెగౌడ కుమార్తె శిల్పను పదేళ్ల క్రితం మైసూరు జిల్లా హుణసూరు తాలూకాలోని హుండిమాళ గ్రామానికి చెందిన లోకమణి (36)కి ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు కొడుకులున్నారు. శిల్ప పెళ్లికాకముందే తన ఇంటిపన్కనుండే అభినందన్ ను ప్రేమించింది. 

వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ వీరి పెళ్లికి శిల్ప కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. బలవంతంగా లోకమణికి ఇచ్చి వివాహం చేశారు. పెళ్లైనా కూడా శిల్ప తన ప్రేమను వదులుకోలేదు. ప్రియుడు అభినందన్ తో సన్నహితంగా ఉంటోంది. ఈ క్రమంలోనే ఎన్నాళ్లు ఇలా రహస్యంగా కలుసుకోవడం లోకమణిని అడ్డు తొలగిస్తే ఇద్దరం సంతోషంగా ఉండొచ్చు కదా.. అని భావించారు. దీనికోసం ప్లాన్ చేశారు. లోకమణికి ఆహారంలో విషం కలిపి పెట్టారు. భోజనం చేసిన గంట తరువాత అతను హఠాత్తుగా చనిపోయాడు. 

Latest Videos

దీంతో అతనికి గుండెపోటు వచ్చి చనిపోయాడని అందరినీ నమ్మించింది. ఆ సమయంలో అది నిజమే కావచ్చని అందరూ నమ్మారు. అయితే, లోకమణి చనిపోయిన.. కొన్ని రోజుల్లోనే శిల్పలో వచ్చిన మార్పును.. లోకమణి తల్లి గుర్తించింది. ఆమెకు అనుమానం వచ్చింది. తన కుమారుడిని కోడలే చంపి ఉంటుందని.. తన కుమారుడిని సహజ మరణం కాదని.. హత్యకు గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  దీంతో పోలీసులు శిల్ప, ఆమె ప్రియుడు అభినందన్ లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. 

Amarnath Cloudburst: జ‌ల‌విల‌యం.. 13 మంది మృత‌దేహ‌ల వెలికితీత‌.. ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్ల జారీ..

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ లో దారుణ ఘటన వెలుగుచూసింది. కన్నతండ్రిలా చూసుకోవాల్సిన సవతి తండ్రి.. ఓ వైపు తల్లితో కాపురం చేస్తూ.. మరోవైపు కూతురి మీద అత్యాచారం చేశాడు. సబ్బవరం సీఐ చంద్రశేఖరరావు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. సబ్బవరానికి చెందిన ఓ మహిళ భర్త తొమ్మిదేళ్ల కిందట మృతి చెందాడు. వారిద్దరికీ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఆ తర్వాత ఆమె సబ్బవరం సాయి నగర్ కాలనీకి చెందిన 34 ఏళ్ల వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. అతని ద్వారా ఆమెకు మరో అమ్మాయి పుట్టింది. మొదటి కుమార్తె (13) సబ్బవరంలోని ఓ హాస్టల్లో ఉంటూ ఏడవ తరగతి చదువు పూర్తి చేసింది. 

చదువుకుంటున్న క్రమంలో సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు.. మారుటి తండ్రి ఆమె మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ చిన్నారి ఒంటరిగా ఉన్న సమయంలో భయపెట్టి, బెదిరించి అత్యాచారం చేసేవాడు.ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అయితే మే నెలలో పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వడంతో బాలిక అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. అమ్మమ్మ ఇల్లు విజయనగరంలో ఉంది. కాగా, సెలవులు అయిపోయి స్కూల్స్ తెరిచినా.. బాలిక అక్కడి నుంచి రావడానికి ఇష్టపడలేదు. దీంతో విషయం బయటపడింది. 

click me!