Sharjeel Imam Case: హైకోర్టును ఆశ్ర‌యించిన‌ ఢిల్లీ అల్ల‌ర్ల‌ కేసులో నిందితుడు.. ఏం జ‌రిగిందంటే?  

Published : Jul 29, 2022, 04:21 PM IST
Sharjeel Imam Case: హైకోర్టును ఆశ్ర‌యించిన‌ ఢిల్లీ అల్ల‌ర్ల‌ కేసులో నిందితుడు.. ఏం జ‌రిగిందంటే?  

సారాంశం

Sharjeel Imam Case: 2019 దేశద్రోహం కేసులో మధ్యంతర బెయిల్‌ను తిరస్కరిస్తూ.. ట్రయల్ కోర్టు ఇచ్చిన  ఉత్తర్వులను స‌వాల్ చేస్తూ.. ఢిల్లీ హింసాకాండ కేసులో నిందితుడు షర్జీల్ ఇమామ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేప‌థ్యంలో ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

Sharjeel Imam Case: ఢిల్లీ హింసాకాండ కేసులో నిందితుడైన షర్జీల్ ఇమాన్.. త‌న‌పై న‌మోదైన దేశద్రోహం కేసులో మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఆగస్టు 25న కోర్టు విచారణ చేపట్టనుంది. దిగువ కోర్టు నిర్ణయాన్ని షార్జీల్ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశారు. అదే సమయంలో ఈ వ్యవహారంపై ఢిల్లీ పోలీసులకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

దిగువ కోర్టు (ట్రయల్ కోర్టు) నిర్ణయాన్ని షార్జీల్ ఇమామ్ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశారు. ఇది కాకుండా, పిటిషన్‌లో దేశద్రోహ విచారణపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన దిగువ కోర్టు ఆదేశాలను కూడా షార్జీల్ సవాలు చేశారు. CAA,  NRC నిరసనల సందర్భంగా 2019 డిసెంబర్‌లో జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో ప్రసంగించినందుకు షార్జీల్ ఇమామ్‌పై దేశద్రోహం కేసు నమోదైంది. తాజాగా, తూర్పు ఢిల్లీ జిల్లా కర్కర్‌దూమా కోర్టు దేశద్రోహం కేసులో నిందితుడైన షర్జీల్ ఇమామ్‌కు పెద్ద ఊరట ల‌భించింది. కానీ, షర్జీల్ ఇమామ్ మధ్యంతర బెయిల్‌ను తిరస్కరించారు.

షర్జీల్ ఇమామ్‌పై ఆరోపణలు ఏమిటి?

పౌరసత్వ (సవరణ) చట్టం, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC)పై ప్రభుత్వానికి వ్యతిరేకంగా షర్జీల్ ఇమామ్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఆరోపించారు. ముఖ్యంగా డిసెంబర్ 2019 జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలో యూనివర్శిటీ వెలుపలి ప్రాంతంలో హింస జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇది కాకుండా.. షార్జీల్ పై దేశద్రోహ ఆరోపణలు న‌మోద‌య్యాయి. షర్జీల్ జనవరి 2020 నుండి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !