
సింగపూర్ లో జరిగే ప్రపంచ నగరాల సదస్సు పర్యటనపై గందరగోళం నెలకొనడంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం స్పందించారు. భారతదేశంలో జరుగుతున్న పనులను ప్రపంచంతో పంచుకునే అవకాశం తనకు లభిస్తే బాగుండేదని అన్నారు. ‘‘ నేను వెళ్లి నా అభిప్రాయాన్ని ముందుకు తెచ్చి, భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రపంచంతో పంచుకోగలిగితే బాగుండేది. దానికి నేను ఎవరినీ నిందించను ’’ అని ఆయన అన్నారు.
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం సింగపూర్‌ను సందర్శించేందుకు అనుమతించనందుకు కేంద్రాన్ని నిందించిన ఒక రోజు తరువాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాజా పరిణామం ఇండియాకు, ఢిల్లీకి అవమానాన్ని తెచ్చిపెట్టిందని అన్నారు. తాను ఈరోజు (శుక్రవారం) సాయంత్రం 4 గంటలకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో సమావేశానికి హాజరవుతారని అన్నారు.
New Health Warning: 'పొగ తాగితే.. పోతారు'.. సిగరెట్, పొగాకు ప్యాకెట్లపై కొత్త వార్నింగ్
కాగా.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సింగపూర్ పర్యటనకు అనుమతి కోరుతూ ఆప్ ప్రభుత్వం జూన్ 7వ తేదీన లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఫైల్ పంపించింది. అయితే అది జూలై 21వ తేదీన తిరిగి వచ్చింది. దీనిపై ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ చాలా ఆలస్యం జరిగింది. ప్రయాణ ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి జూలై 20 చివరి తేదీ. అది కూడా కూడా ముగిసింది" అని పేర్కొంది. ఆరోగ్యం, విద్య, ఇతర రంగాలలో ఢిల్లీలో చేసిన ప్రపంచ స్థాయి పనుల గురించి అంతర్జాతీయ ఫోరమ్‌లో మాట్లాడకుండా సీఎంను ఆపడం కేంద్రం ఉద్దేశమని కూడా ఆరోపించింది.‘‘ కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరి ఉండవచ్చు, కానీ ప్రపంచ సమాజంలో దేశం అవమానాన్ని ఎదుర్కొంది. ఈ విధానానికి కూడా కేంద్రమే బాధ్యత వహిస్తుంది ’’ అని ఆ ప్రకటన పేర్కొంది.
ఈ విషయంలో గతంలో కూడా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. తనను ఆగస్టు 1వ తేదీన సింగపూర్ లో జరిగే ప్రపంచ నగరాల సదస్సుకు హాజరుకావాలని సింగపూర్ హైకమిషనర్ సైమన్ వాంగ్ ఆహ్వానించారని తెలిపారు. అయితే దీనికి లెఫ్టనెంట్ గవర్నర్ ఆమోదం తెలపడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి, ‘ఢిల్లీ మోడల్’ ను తెలియజేయానికి అనుమతిని కోరుతూ తాను జూన్ 7న కూడా లేఖ రాశానని గుర్తు చేశారు. ఇంత ముఖ్యమైన వేదికను సందర్శించకుండా సీఎంను అడ్డుకోవడం దేశ ప్రయోజనాలకు విరుద్ధమని తెలిపారు.
రెండు రోజుల్లో రెండు వరుస హత్యలు.. కర్నాటకలో ఉద్రిక్తత.. లెటెస్ట్ అప్‌డేట్స్
అయితే ఈ ఆరోపణలను లెఫ్టినెంట్ గవర్నర్ తోసిపుచ్చారు. ‘‘ ఇది మేయర్ సమావేశం. దీనికి సీఎంలు వెళ్లకూడదు ’’ అని ఆయన పేర్కొన్నారు. కాగా.. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం మంత్రులు, అధికారులు విదేశాలకు వెళ్లాలంటే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి అవసరం ఉంటుంది. అయితే ఢిల్లీ సీఎం టూర్ విషయంలో లెఫ్టనెంట్ గవర్నర్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ అనుమతి అవసరం. దీని తరువాత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి కూడా రాజకీయ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు అనుమతులు లేకుండా విదేశీ పర్యటనలు చేయలేరు. కానీ ప్రస్తుతం కేజ్రీవాల్ సింగపూర్ టూర్ కు సంబంధించిన ఫైల్ ను లెఫ్టనెంట్ గవర్నర్ తిరస్కరించారు