
New Health Warning: ధూమపానం ఆరోగ్యానికి హానికరం అన్న సంగతి తెలిసిందే. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే పొగాకు ఉత్పత్తులైన సిగరెట్, బీడీ, పాన్ మసాలా వంటి ఉత్పత్తులపై ‘పొగాకు వాడకం.. ఆరోగ్యానికి హానికరం’ అనే హెచ్చరికను ముద్రిస్తుంది. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. వాస్తవానికి నిబంధనల ప్రకారం 18 ఏళ్లు దాటిన వాళ్లు మాత్రమే మన దేశంలో స్మోకింగ్ చేయొచ్చు. ఈ అర్హత వయస్సును 21కి పెంచాలని కేంద్రం భావిస్తోంది.
ఈ తరుణంలో కొత్త హెచ్చరికలను అమల్లోకి తీసుకవచ్చింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. డిసెంబర్ 1, 2022న లేదా ఆ తర్వాత తయారు చేయబడిన, దిగుమతి చేసుకున్న లేదా ప్యాక్ చేయబడిన పొగాకు ఉత్పత్తులపై "పొగాకు వల్ల బాధాకరమైన మరణం సంభవిస్తుంది " అనే అర్థం వచ్చేలా నూతన ఆరోగ్య హెచ్చరిక తో పాటు ఓ చిత్రాన్ని ముద్రించాలని కేంద్రం పేర్కొంది. ఈ నూతన హెచ్చరిక డిసెంబర్ 1 నుండి ఒక సంవత్సరం పాటు అమలులో ఉంటుందని తెలిపింది.
2023 డిసెంబర్ 1 నుంచి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన మరో కొత్త హెచ్చరిక అమల్లోకి రానుంది. దీని ప్రకారం.. డిసెంబర్ 1, 2023 తర్వాత తయారు చేయబడిన. దిగుమతి చేసుకున్న లేదా ప్యాక్ చేయబడిన పొగాకు ఉత్పత్తులుపై “పొగాకు వినియోగదారులు యుక్త వయసులోనే మరణిస్తారు” అనే అర్థం వచ్చే హెచ్చరికతో కూడిన చిత్రాన్ని ప్రదర్శించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఈ మేరకు సిగరెట్, ఇతర పొగాకు ఉత్పత్తుల తయారీ (ప్యాకేజీ, లేబులింగ్) నిబంధనలు-2008లో ఈ మేరకు సవరణలు చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది.
ఈ మేరకు సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల (ప్యాకేజింగ్, లేబులింగ్) నియమాలు- 2008లో సవరణలు చేసింది. 2022 జూలై 21న కొత్త ఆరోగ్య హెచ్చరికలను మంత్రిత్వ శాఖ తెలియజేసింది. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు (ప్యాకేజింగ్, లేబులింగ్) మూడవ సవరణ నియమాలు- 2022 ప్రకారం సవరించిన నియమాలు డిసెంబర్ 1, 2022 నుండి అమలులోకి వస్తాయి. కొత్త హెచ్చరికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కేంద్రం http://www.mohfw.gov.in, http://ntcp.nhp.gov.in వెబ్‌సైట్లలో చూడవచ్చు. ఈ
నోటిఫికేషన్ 19 భాషల్లో అందుబాటులో ఉంది.
సిగరెట్లు లేదా ఏదైనా పొగాకు ఉత్పత్తుల తయారీ, ఉత్పత్తి, సరఫరా, దిగుమతి లేదా పంపిణీలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాలుపంచుకున్న ఎవరైనా పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై పేర్కొన్న ఆరోగ్య హెచ్చరికలను ఖచ్చితంగా నిర్దేశించారని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే.. సిగరెట్లు,ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం- 2003లోని సెక్షన్ 20 ప్రకారం జైలు శిక్ష లేదా జరిమానాతో శిక్షార్హమైన నేరం అని ప్రభుత్వం పేర్కొంది.