మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు ఉండాలనే దానిపై ప్రజల నుండి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రజలనుండి అభిప్రాయాలు కోరారు.
న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సన్నద్దమౌతుంది. లోక్ సభ ఎన్నికలు 2024లో ఎన్నికల మేనిఫెస్టోలో ఏ అంశాలు పొందుపర్చాలనే దానిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రజల నుండి అభిప్రాయాలు కోరారు. నమో యాప్ ద్వారా తమ అభిప్రాయాలను తెలపాలని మోడీ ప్రజలను కోరారు.ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశంలో ఈ విషయమై ప్రజలకు సందేశం అందించారు.
బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజల భాగస్వామ్యం ఉండేందుకు వీలుగా ఈ కార్యక్రమానికి బీజేపీ శ్రీకారం చుట్టింది. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో యువకుల కోసం ఏ రకమైన అంశాలు పొందుపర్చాలనే దానిపై కూడ సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు. ప్రజలు తమ సూచనలు, సలహాలు, అభిప్రాయాలను www.narendramodi.in వెబ్ సైట్ ద్వారా తెలపవచ్చని కూడ మోడీ కోరారు. మంచి సూచనలు, సలహాలు, అభిప్రాయాలు తెలిపిన వారితో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేరుగా మాట్లాడే అవకాశం ఉంది.
undefined
బీజేపీ మేనిఫెస్టో ఎలా ఉండాలి? మీరు NaMo యాప్ ద్వారా నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దీనికి సంబంధించిన సూచనలను పంపవచ్చు.
Link : https://t.co/MswMyKREBF pic.twitter.com/CIF9ouK8Cv
2024 లోక్ సభ ఎన్నికల ప్రచార థీమ్ ను బీజేపీ ప్రారంభించింది. మోడీ సమక్షంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ. నడ్డా ఈ థీమ్ ను ఆవిష్కరించారు. సామాన్య ప్రజలకు నచ్చే ట్యూన్ లో ఇది రూపొందించారు. గతంలో కూడ దేశ వ్యాప్తంగా ఉన్న ఎంపీలపై అభిప్రాయాలను కూడ నమో యాప్ ద్వారా ఇవ్వాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోరిన విషయం తెలిసిందే.