హనీమూన్ (honeymoon) కోసం గోవా (Goa)కు తీసుకెళ్తానని చెప్పి అయోధ్య (Ayodhya ram temple)కు తీసుకెళ్లిన భర్తపై ఆ భార్య ఆగ్రహం పెంచుకుంది. ట్రిప్ కు వెళ్లి వచ్చిన తరువాత ఆమె కోర్టును ఆశ్రయించింది. (Wife seeks divorce from husband who took him to Ayodhya saying he will take him to Goa for honeymoon) తనకు భర్త నుంచి విడాకులు ఇవ్వాలని కోరింది.
హనీమూన్ కోసం గోవాకు తీసుకెళ్తానని మాట ఇచ్చి, తనను భర్త అయోధ్య తీసుకెళ్లాడని చెబుతూ ఓ మహిళ విడాకులు కోరింది. ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ వెలుగులోకి వచ్చింది. ఆ నగరానికి చెందిన ఓ మహిళ తన భర్త గోవా అని చెప్పి, అయోధ్య, వారణాసికి తీసుకెళ్లాడని చెబుతూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. ఫ్రీ ప్రెస్ జర్నల్ కథనం ప్రకారం.. ఈ దంపతులు ఇద్దరూ హిందూ పుణ్యక్షేత్రాలను సందర్శించి, తిరిగి వచ్చిన 10 రోజుల తరువాత ఈ కేసు ఫ్యామిలీ కోర్టుకు చేరుకుంది.
చెప్పుల ట్రీట్‌మెంట్ కాంగ్రెస్ నేతలకే కావాలి.. రైతులకు కాదు.. - కేటీఆర్
తన భర్త ఐటీ రంగంలో పనిచేస్తున్నాడని, బాగా సంపాదిస్తున్నాడని భార్య తన విడాకుల పిటిషన్ లో పేర్కొంది. తాను కూడా ఉద్యోగం చేస్తున్నానని, మంచి జీతం పొందుతున్నాని ఆమె వివరించింది. అయితే పెళ్లయిన తరువాత విదేశాలకు హనీమూన్ వెళ్లాలని అనుకున్నానని ఆమె తెలిపారు. అయితే విదేశాలకు వెళ్లేందుకు తన భర్త నిరాకరించాడని పేర్కొన్నారు. తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని, అందుకే విదేశాలకు రాలేనని తన భర్త చెప్పారని ఆమె వెల్లడించారు.
ప్రతిపక్షంలో బుద్దిగా పని చేయ్ కేటీఆర్ - మంత్రి సీతక్క ఫైర్
విదేశాలకు బదులుగా భారత్ లోని ఏ ప్రదేశానికి అయినా తాను వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని భర్త చెప్పారు. అయితే గోవా తో పాటు దక్షిణ భారత దేశ పర్యటన చేసేందుకు భార్య అంగీకరించింది. కానీ, ఆ తర్వాత భర్త ఆమెకు చెప్పకుండా అయోధ్య, వారణాసికి విమాన టికెట్లు బుక్ చేశాడు. టూర్ కు బయలుదేరే ఒక రోజు ముందు మాత్రమే భార్యకు అసలు విషయం చెప్పాడు. జనవరి 22న జరిగిన రామమందిర ప్రతిష్ఠా కార్యక్రమానికి ముందు తన తల్లి నగరాన్ని సందర్శించాలని కోరుకోవడంతో అయోధ్యకు వెళ్తున్నామని తెలిపారు.
రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్..
ఈ విషయంలో భార్యకు కోపం వచ్చినప్పటికీ ఎదురు తిరగలేదు. తన భర్త నిర్ణయించిన ప్లాన్ ప్రకారం.. ట్రిప్ కు బయలుదేరింది. ట్రిప్ మొత్తం ముగించుకొని తిరిగి వచ్చిన తరువాత ఆమె ఓ పెద్ద నిర్ణయం తీసుకుంది. ఆమె తన భర్త నుంచి విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. తన కంటే కుటుంబ సభ్యులనే భర్త బాగా చూసుకుంటారని ఆమె తన వాంగ్మూలంలో పేర్కొంది.