ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పని తీరును నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar) మెచ్చుకున్నారు. మోదీ ఏదైనా పనిని చేపడితే.. దానిని పూర్తిచేసే వరకు విశ్రమించరని అన్నారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల ఉమ్మడి ప్రభుత్వం ఉన్న మహారాష్ట్రలో కొందరు మంత్రులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు తీసుకున్న చర్యల గురించిన అంశాన్ని ఎప్పుడైనా ప్రధాని మోదీ వద్ద ప్రశ్నించారా..? అనే ప్రశ్నకు కూడా పవార్ సమాధానమిచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పని తీరును నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar) మెచ్చుకున్నారు. మోదీ ఏదైనా పనిని చేపడితే.. దానిని పూర్తిచేసే వరకు విశ్రమించరని అన్నారు. పుణెలోని మరాఠీ దినపత్రిక లోక్‌సత్తా నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న శరద్ పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో పలు ప్రశ్నలకు శరద్ పవార్ సమాధానం ఇచ్చారు. ‘మోదీ ఏదైనా పని చేపడితే.. అది మధ్యలో నిలిచిపోకుండా చూసుకుంటారు. దానిని పూర్తిచేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు.. అందుకు తగిన సమయం కూడా ఇస్తారు. ఆయనకు పరిపాలనపై మంచి పట్టు ఉంది. అదే ఆయన బలం’ అని శరద్ పవార్ ఓ ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు.
ఇన్నేళ్లలో నాయకుడిగా Modi పాలనలో ఎలాంటి మార్పులు గమనించారనే ప్రశ్నకు కూడా Sharad Pawar బదులిచ్చారు. ‘పాలనాపరమైన నిర్ణయాలు సామాన్యులకు, వారి ఆకాంక్షలకు అనుగుణంగా లేకుంటే.. అంతిమ ఫలితాలను విస్మరించలేం. కష్టపడి పని చేయడం ఒకటే సరిపోదు’ అని పవార్ అన్నారు. ఈ అంశంలో తాను ఒక లోటును చూస్తున్నానని చెప్పారు.
undefined
‘ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని ప్రభావవంతంగా అమలుచేసేందుకు పాలనాయంత్రాంగం, సహచర మంత్రులు కలిసి పనిచేసేలా మోదీ చూసుకుంటారు. ఈ విషయంలో ఆయన ఒక ప్రత్యేకతను కలిగి ఉన్ానరు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తోపాటు, గత ప్రధానులలో ఆ శైలి కనిపించదు’ అని ఎన్సీపీ అధినేత పేర్కొన్నారు.
శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల ఉమ్మడి ప్రభుత్వం ఉన్న మహారాష్ట్రలో కొందరు మంత్రులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు తీసుకున్న చర్యల గురించిన అంశాన్ని ఎప్పుడైనా ప్రధాని మోదీ వద్ద ప్రస్తావించాలని అనుకుంటున్నారా అని ప్రశ్నించగా.. తాను ఆ విషయంపై ఎప్పుడూ మోదీతో మాట్లాడలేదని పవార్ చెప్పారు. గతంలో కానీ, భవిష్యత్తులో గానీ ఆ పని చేయనని అన్నారు.
2019 మహారాష్ట్ర ఎన్నికల తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై ఎదురైన ప్రశ్నలకు కూడా శరద్ పవార్ సమాధానమిచ్చారు. ఆ సమయంలో తమ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ ప్రయత్నించిందని చెప్పారు. అయితే తాను అందుకు అనుకూలంగా లేనని అన్నారు. రెండు పార్టీల మధ్య పొత్తు గురించి చర్చలు జరిగిన మాట వాస్తమేనని అంగీకరించారు. దీని గురించి ఆలోచించాలని ప్రధాని మోదీ అన్నారని.. కానీ అది సాధ్యం కాదని ఆయన కార్యాలయంలోనే వెల్లడించానని పవార్ చెప్పారు. తన మేనల్లుడు అజిత్ పవార్‌ను బీజేపీతో చేతులు కలిపేందుకు తాను పంపించి ఉంటే.. ఆ పనిని పూర్తి చేసేవాడిని అని తెలిపారు.
అప్పటి యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తాను, ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్, కొత్త మంది కేబినెట్ సహచరులు కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగా ఉన్నట్టుగా చెప్పారు. కొందరు కేబినెట్ సహచరులు అలాంటి చర్యల వైపు మొగ్గు చూపినప్పటికీ.. తాను, మన్మోహన్ సింగ్ వాటిని వ్యతిరేకంగా నిలిచిన విషయం కొంతవరకు నిజం అని పేర్కొన్నారు.