భారత్‌లో భారీగా పెరిగిన కరోనా కేసులు.. నిన్నటి కంటే 43 శాతం అధికం.. 961కి చేరిన ఒమిక్రాన్ కేసులు..

By Sumanth Kanukula  |  First Published Dec 30, 2021, 10:06 AM IST

దేశంలో కరోనా కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో 13,154 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. తాజా కేసుల సంఖ్యను నిన్నటి డేటాతో పోలిస్తే 43 శాతం పెరుగుదల కనిపిస్తోంది. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా రోజురోజుకు భారీగా పెరుగుతుంది.


దేశంలో కరోనా కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. నిన్నటితో పోలిస్తే తాజా కేసుల సంఖ్య 43 శాతం పెరిగింది. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది. దేశంలో 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ వేరియంట్ విస్తరించగా.. ఇప్పటివరకు 961 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం బులిటెన్ విడుదల చేసింది. ఒమిక్రాన్ బారిన పడ్డ వారిలో 320 మంది కోలుకున్నారని వెల్లడించింది. ఒమిక్రాన్ కేసుల విషయానికి వస్తే.. ఢిల్లీలో అత్యధికంగా 263 కేసులు నమోదు కాగా,  మహారాష్ట్రలో 257, గుజరాత్‌లో 97, రాజస్తాన్‌లో 69, కేరళలో 65 కేసులు నమోదయ్యాయి. 

ఇక, దేశంలో గడిచిన 24 గంటల్లో 13,154 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇది క్రితం రోజు నమోదైన 9,195 కేసులతో పోలిస్తే.. 43 శాతం ఎక్కువ. ఇక, తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,48,22,040కి పెరిగింది. తాజాగా కరోనాతో 268 మృతిచెందగా.. దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,80,860కి చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా నుంచి 7,486 మంది కోలుకోగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 3,42,58,778‬కి చేరింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 82,402 గా ఉంది.

Latest Videos

undefined

 



𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/rrT3krGD3S pic.twitter.com/WUlpXzU3BU

— Ministry of Health (@MoHFW_INDIA)

ఒమిక్రాన్ కేసుల విషయానికి వస్తే.. 
ఢిల్లీలో 263, మహారాష్ట్రలో 252, గుజరాత్‌లో 97, కేరళలో 65, తెలంగాణలో 62, రాజస్తాన్‌లో 69, కర్ణాటకలో 34, తమిళనాడులో 45, హర్యానాలో 12, పశ్చిమ బెంగాల్‌లో 11, మధ్యప్రదేశ్‌లో 9, ఒడిశాలో 9, ఆంధ్రప్రదేశ్‌లో 16, ఉత్తరాఖండ్‌లో 4, చంఢీఘర్‌లో 3, జమ్మూ కశ్మీర్‌లో 3, ఉత్తరప్రదేశ్‌లో 2, గోవాలో 1, హిమాచల్‌ ప్రదేశ్‌లో 1, లడఖ్‌లో 1, మణిపూర్‌లో 1, పంజాబ్‌లో 1 కేసులు నమోదయ్యాయి. 

click me!