ప్రతిపక్షాలపై శరద్ పవార్ ఫైర్.. డిగ్రీ అంశం తప్ప దేశంలో ముఖ్యమైన సమస్యలేమీ లేవా అంటూ కామెంట్స్..

By Asianet NewsFirst Published Apr 10, 2023, 8:51 AM IST
Highlights

ప్రధాని డిగ్రీ అంశంపై విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్షాలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఇంకా ముఖ్యమైన సమస్యలపై ప్రతిపక్షాలు ఫొకస్ చేయాలని సూచించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, శాంతి భద్రతలపై ప్రశ్నలు అడగాలని అన్నారు. 

కొన్ని రోజుల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్, శివసేన (యూబీటీ) నాయకుడు ఉద్దవ్ ఠాక్రే, ఇతర ప్రతిపక్ష నాయకులు ప్రధాని మోడీ విద్యార్హతలపై విమర్శలపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో డిగ్రీ అంశం తప్ప.. మరే ఇతర ముఖ్యమైన సమస్యలు లేవా అంటూ ప్రశ్నించారు. అనేక సమస్యలను వదిలేసి నాయకుల విద్యార్హతలపై ప్రశ్నలు గుప్పిస్తూ సమయాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు.

బాలుడికి దలైలామా లిప్ కిస్సులు, నాలుకను చప్పరించమంటూ.. వివాదాస్పదమవుతున్న వైరల్ వీడియో..

ఆదివారం శరద్ పవార్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు నిరుద్యోగం, శాంతిభద్రతలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు. వాటిపై ప్రశ్నలు సంధించడం ప్రతిపక్షాలకు మంచిదని అన్నారు. ప్రస్తుతం అందరూ విద్యార్హతలపై తరచూ ప్రశ్నలు అడుగుతున్నారని తెలిపారు. ‘‘ నీ డిగ్రీ ఏమిటి, నా డిగ్రీ ఏమిటి ఇలా అడుగుతున్నారు ? ఇవన్నీ రాజకీయ అంశాలేనా?’’ అని శరద్ పవార్ మరాఠీలో అన్నారు.

రామ మందిరం కోసం మోడీ తప్ప ఎవ్వరూ ఏమీ చేయలేదు.. ఆయనే బాలసాహెబ్ కల నెరవేర్చారు - ఏక్ నాథ్ షిండే

‘‘నిరుద్యోగం, శాంతిభద్రతలు, ద్రవ్యోల్బణంపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించండి. ఇతర కీలక విషయాలు చూడండి. మతం, కులం పేరుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. అకాల వర్షాలకు మహారాష్ట్రలో పంటలు దెబ్బతిన్నాయి. వీటిపై చర్చలు జరపాల్సిన అవసరం ఉంది’’ అని శరద్ పవార్ అన్నారు.

హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపిన ముంబై పోలీసులు.. ఇది ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన కాదా అంటూ నెటిజన్ల ప్రశ్నలు..

ప్రతిపక్షాలు సరైన అంశాలపై ఫొకస్ చేయడం లేదంటూ శరద్ పవార్ వ్యాఖ్యానించం ఇది రెండో సారి. రెండు రోజుల కిందట అదానీకి గ్రూప్ నకు మద్దతుగా నిలిచిన ఆయన.. ఆ సంస్థపై అమెరికా షార్ట్ సెల్లర్ హిండెంన్ బర్గ్ రీసెర్చ్ నివేదికపై వస్తున్న కథనాలను తప్పుబట్టారు. అదానీ-హిండెన్ బర్గ్ వివాదంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విచారణ జరిపించాలని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం కూడా సరైంది కాదని అన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. అయితే శరద్ పవార్ పార్టీకి అభిప్రాయాలు ఉండవచ్చునని, కానీ ప్రతిపక్షాలన్నీ ఇంకా ఐక్యంగానే ఉన్నాయని కాంగ్రెస్ పేర్కొంది.

click me!