మోడీ ఓబీసీ కాబట్టే శంకరాచార్యులు అయోధ్యకు రాలేదు - ఉదయనిధి స్టాలిన్

By Sairam Indur  |  First Published Feb 5, 2024, 1:21 PM IST

ప్రధాని నరేంద్ర మోడీ (Prime minister Narendra modi) ఓబీసీ (OBC) కాబట్టే శంకరాచార్యులు (Shankaracharyulu) అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ట (ayodhya ram mandir pran pratishtha) కార్యక్రమానికి హాజరుకాలేదని తమిళనాడు మంత్రి, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ అన్నారు.  సనాతన ధర్మంలో అసమానతలు ఉన్నాయని తాను గతంలోనే చెప్పానని గుర్తు చేశారు.


ప్రధాని నరేంద్ర మోడీ వెనుకబడిన వర్గానికి (ఓబీసీ) చెందిన వ్యక్తి అని, ఆయన చేతుల మీదుగా అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగడం వల్లే శంకరాచార్యులు అయోధ్యకు రాలేదని డీఎంకే నాయకుడు, తమిళనాడు క్రీడా అభివృద్ధి, యువజన వ్యవహారాల శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు. తూర్పు చెన్నై డీఎంకే జిల్లా శాఖ ఏర్పాటు చేసిన పార్టీ బూత్ ఏజెంట్ల సమావేశంలో ఆయన పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.

కాశీ, మథురలకు విముక్తి లభిస్తే.. ఇతర ఆలయాల వివాదాలకూ పరిష్కారం - గోవింద్ దేవ్ గిరి మహరాజ్

Latest Videos

గతంలో తాను సనాతన ధర్మంలో ఉన్న అసమానతల గురించి మాట్లాడానని గుర్తు చేశారు. అయితే అసమానతలు ఉన్నాయనడానికి పీఠాధిపతుల చర్యే నిదర్శనమని చెప్పారు. ‘‘ఈ విషయాన్ని నాలుగు నెలల క్రితమే నేను చెప్పాను. నేను మీ కోసం మాట్లాడాను. అందరూ సమానమేనని చెప్పాను’’ అని సనాతన ధర్మంపై తాను చేసిన ప్రసంగాన్ని గుర్తు చేసుకున్నారు. 

టీఎస్ పీఎస్సీలో కీలక మార్పు.. కొత్త సెక్రటరీగా నవీన్ నికోలస్

సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పబోనని ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు. వితంతువు కావడం, గిరిజన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును బీజేపీ ప్రభుత్వం ఆహ్వానించలేదని ఆరోపించారు. డీఎంకే ఏ మతానికి, రామ మందిర నిర్మాణానికి వ్యతిరేకం కాదని, అయితే దేశ రాష్ట్రపతిని కూడా దీనికి ఆహ్వానించలేదని ఆయన పునరుద్ఘాటించారు.

టీఎస్ నుంచి టీజీగా మార్చడానికి కారణం అదే - మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

కాగా.. 2023 సెప్టెంబర్ లో అభ్యుదయ రచయితల సదస్సులో ఉదయనిధి స్టాలిన్  సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని పిలుపునిచ్చారు. సనాతన ధర్మం కరోనా వైరస్, మలేరియా, డెంగ్యూ లాంటిదని, సమానత్వం, సామాజిక న్యాయం అభివృద్ధి చెందాలంటే దాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు.

పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కన్నుమూత..

ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారాన్ని రేపాయి. ఆయనపై పలు చోట్లు కేసులు నమోదు అయ్యాయి. దీనిపై ఆయన స్పందించారు. అయితే న్యాయస్థానాలపై తనకు తగిన గౌరవం ఉందని, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని ఉదయనిధి స్టాలిన్ అన్నారు.

click me!