
రాజస్థాన్ : మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ.. గవర్నమెంట్ స్కూల్ టీచర్ ను చితకబాదారు విద్యార్థిని తల్లిదండ్రులు. దీంతో సదరు ఉపాధ్యాయుడికి తీవ్ర గాయాలయ్యాయి. తల, ముఖంపై నల్లగా కమిలిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
రాజస్థాన్‌లోని గంగానగర్ జిల్లాలో 16 ఏళ్ల విద్యార్థినిపై ఆమె చదివే స్కూల్ లో ఓ టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆ విద్యార్థిని కుటుంబ సభ్యులు నిందితుడైన ఉపాధ్యాయుడు రాజేష్‌పై కేసు నమోదు చేశారు.
ఒలింపియన్ మహిళా రెజ్లర్ మార్ఫింగ్ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్, హర్యానా వ్యక్తి అరెస్ట్..
దాడి తరువాత.. తనను కొట్టినందుకు బాలిక కుటుంబంపై రాజేష్ క్రాస్ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశాడు. కరణ్‌పూర్ సర్కిల్ ఆఫీసర్ సుధా పలావత్ మాట్లాడుతూ, వేధింపుల సంఘటన గురించి తెలుసుకున్న విద్యార్థి కుటుంబ సభ్యులు పాఠశాలకు చేరుకుని నిందితుడిని కొట్టారు.
ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై శనివారం బాలిక కుటుంబసభ్యులు కేసు నమోదు చేయగా, ఉపాధ్యాయుడు ఆదివారం క్రాస్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు సిఓ తెలిపారు. “ఈ విషయంలో దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు' అని ఆమె తెలిపారు.