దారుణం.. మతిస్థిమితం లేని పదమూడేళ్ల బాలిక మీద లైంగిక దాడి..

Published : Dec 22, 2021, 09:15 AM IST
దారుణం.. మతిస్థిమితం లేని పదమూడేళ్ల బాలిక మీద లైంగిక దాడి..

సారాంశం

సాయంత్రం ఇంటికి వచ్చిన దంపతులు తమ బిడ్డ nakedగా ఉండడం చూసి, మతిస్తిమితం లేదు కదా తనకు తెలియకుండానే బట్టలు ఊడిపోయి ఉంటాయనుకున్నారు. అయితే అదేరోజు రాత్రి బాలిక తీవ్ర అస్వస్థతకు గురవ్వడం చూసి, ఆందోళన చెందారు. చికిత్స నిమిత్తం దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో పరీక్షించిన వైద్యులు బాలిక మీద లైంగిక దాడి జరిగినట్లు ధ్రువీకరించారు. 

ఒడిశా : మతిస్థిమితం లేని బాలిక మీద Sexual assault జరిగిన సంఘటన జిల్లాలో సంచలనం రేకెత్తించింది. సోమవారం ఉదయం జిల్లా కేంద్రానికి సమీపంలోని నతమ గ్రామంలో భగీరథి నచిక తన 13 యేళ్ల insane బాలికను ఎప్పటిలాగే ఇంటి దగ్గరే ఉంచి, కట్టెల కోసం భార్యతో కలిసి సమీపంలోని అడవికి వెళ్లాడు. ఎవ్వరూ లేని సమయం చూసిన దుండగులు బాధిత బాలిక మీద లైంగిక దాడికి పాల్పడినట్లు సమాచారం. 

సాయంత్రం ఇంటికి వచ్చిన దంపతులు తమ బిడ్డ nakedగా ఉండడం చూసి, మతిస్తిమితం లేదు కదా తనకు తెలియకుండానే బట్టలు ఊడిపోయి ఉంటాయనుకున్నారు. అయితే అదేరోజు రాత్రి బాలిక తీవ్ర అస్వస్థతకు గురవ్వడం చూసి, ఆందోళన చెందారు. చికిత్స నిమిత్తం దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో పరీక్షించిన వైద్యులు బాలిక మీద లైంగిక దాడి జరిగినట్లు ధ్రువీకరించారు. 

కన్నీరుమున్నీరైన బాధిత తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించి జరిగిన సంఘటన మీద ఫిర్యాదు చేశారు. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుని, కోర్టుకు అప్పగిస్తామని ఐఐసీ అధికారి రస్మీరంజన్ ప్రధాన్ భరోసా తెలిపారు. 

ఆ ఇంట్లో 12 ఓట్లు.. కానీ వ‌చ్చింది ఒకే ఓటు. అదీ అభ్య‌ర్థి వేసుకున్న‌దే.. గుజారాత్‌లో విచిత్రం

ఇదిలా ఉండగా, ప్రియురాలి మీద స్నేహితులతో కలిసి rape attemptకి పాల్పడ్డాడో కిరాతక ప్రియుడు. ఈ దారుణమైన ఘటన నామక్కల్ లో వెలుగుచూసింది. bihar కు చెందిన ఓ యువతి నామక్కల్ లోని వేప్పేడులోని ఓ ప్రైవేటు మిల్లులో పనిచేస్తోంది. అక్కడే పనిచేస్తున్న బాల్ రాజ్ తో ఈమెకు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. అయితే, ఆదివారం సెలవు కావడంతో ప్రియురాలికి మాయమాటలు చెప్పి తన ఇంటికి బాల్ రాజ్ తీసుకెళ్లాడు.

ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో అక్కడి నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేసిన ఆమె మీద బాలరాజు లైంగికదాడి చేశాడు. అంతే కాదు మిత్రులు ప్రదీప్, మనోజ్ కు అప్పగించాడు. ముగ్గురు కలిసి ఆమె మీద పలుమార్లు సామూహిక లైంగిక దాడి చేయడంతో ఆమె స్పృహ తప్పింది.  ఆమె స్పృహ తప్పి కింద పడిపోవడంతో ఆందోళన చెందిన అక్కడి నుంచి ఆ ముగ్గురు ఉడాయించారు.

తమకిష్టంలేని పెళ్లి చేసుకుందని... కూతురు తాళి తెంచిన తండ్రి.. జుట్టుపట్టి రోడ్డుమీద ఈడ్చుకెడుతూ..

అర్థరాత్రి వేళ స్పృహలోకి వచ్చిన ఆ యువతి పెట్టిన కేకలతో ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. ఆమె ఇచ్చిన సమాచారంతో బీహార్ కు పారిపోయే ప్రయత్నంలో ఉన్న ముగ్గురిని సోమవారం పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.  

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu