
మైసూరు : అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు తమను కాదని loverతో వెళ్లిపోవడంతో తట్టుకోలేని తండ్రి రోడ్డు మీదే ఆమెపై దాడి చేశాడు. కుమార్తె మెడలో ఉన్న తాళిబొటటును తెంచేసి.. జుట్టు పట్టుకుని తండ్రి ఈడ్చుకెడుతుండడం చూసిన జనం.. అడ్డుకున్నారు. వివరాల్లోకి వెడితే.. నంజనగూడు తాలూకాలని హరతళె గ్రామానికి చెందిన చైతర్ర, హల్శెర గ్రామానికి చెందిన మహేంద్ర సుమారు ఏడాదిన్నర కాలంగా ప్రేమించుకుంటున్నారు.
పెళ్లి చేసుకుందామనుకుని విషయాన్ని ఇద్దరి ఇళ్లల్లోనూ చెప్పారు. అయితే ఈ పెళ్లికి యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దాంతో ప్రేమజంట ఈ నెల 8వ తేదీన ఒక గుడిలో మూడు ముళ్లు వేసుకుని, ఆ పెళ్లిని రిజిస్టర్ చేసుకోవాలని సోమవారం సాయంత్రం 4 గంటలప్పుడు నంజనగూడుకు రాగా, చైత్ర తండ్రి బసవరాజు నాయక్ అడ్డుకున్నాడు. కుమార్తె మెడలోని తాళిని తెంచేశాడు. ఆమె జుట్టు పట్టుకుని లాక్కెళ్లసాగాడు.
ఈ హఠాత్ పరిణామానికి చైత్ర, మహేంద్ర ఇద్దరూ షాక్ అయ్యారు. తండ్రి లాక్కెడుతుండడంతో చైత్ర గట్టిగా కాపాడండి.. కాపాడండి అంటూ అరవసాగింది. ఈ అరుపులు విన్న స్థానికులు తండ్రిని అడ్డుకున్నారు. వెంటనే తండ్రి నుంచి విడిపించుకుని భర్తను చేరుకుంది. స్థానికుల సాయంతో ఆమె నంజనగూడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి తండ్రి మీద ఫిర్యాదు చేసింది. తండ్రి నుంచి తమకు భద్రత కల్పించాలని కోరింది. ఈ తతంగమంతా చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
ప్రాణం మీదికి తెచ్చిన కుక్క ముద్దుపేరు.. ‘సోను’ అని పెట్టారని, మహిళలపై కిరోసిన్ పోసి నిప్పంటించారు..
ఇదిలా ఉండగా, గ్రేటర్ నోయిడాలోని ఓ అపార్ట్ మెంట్ 7వ అంతస్తు నుంచి ఓ యువతి నగ్నంగా కిందపడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. West Bengal కు చెందిన ఓ యువతి.. తన ప్రియుడి కోసం గతంలో ఇంటిని విడిచి పెట్టి వెళ్లిపోయింది. ఆ తరువాత వారిద్దరూ పానీపత్ లో వివాహం చేసుకున్నారు. ఆ బంధం ఎక్కవ కాలం నిలువలేదు. పలు కారణాల వల్ల వారు విడిపోయారు. ఆ తరువాత ఆ యువతి Panipat లోని ఓ షాపింగ్ మాల్ లో పనిచేయడం మొదలు పెట్టింది.
ఈ సమయంలో గ్రేటర్ నోయిడాలోని ఓ NRI Societyకి చెందిన కెమికల్ ఇంజినీర్ Nitin Guptaతో ఆమెకు పరిచయం అయ్యింది. ఈ నెల 2న ఉదయం.. నితిన్ గుప్తా నివాసం కింద ఆ యువతి Nakedగా పడి ఉండడం స్థానికంగా కలకలం రేపింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. నితిన్ గుప్తాను విచారించారు.
‘కోవిడ్ కారణంగా... నా భార్య గతేడాది మరణించింది. అప్పుడే ఆ యువతితో నాకు పరిచయం ఏర్పడింది. తరచూ కలుస్తూ ఉండేవాళ్లం. ఆ రోజు తను నా ఇంటికి వచ్చింది. ఇద్దరం భోజనం చేసి పడుకున్నాం. ఉదయం ఆరు గంటల సమయంలో తను లేచి స్నానాల గదికి వెళ్లింది. అనంతరం కింద పడిపోయింది. నా ఇల్లు 7వ అంతస్తులో ఉంది. అని నితిన్ పోలీసులకు చెప్పాడు. ప్రస్తుతం యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.