Rainfall : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. దేశంలోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు

Published : Aug 01, 2023, 03:21 PM IST
Rainfall : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. దేశంలోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు

సారాంశం

New Delhi: ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా మారిందని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) తెలిపింది. బంగ్లాదేశ్ లోని ఖేపుపారాకు తూర్పు-ఆగ్నేయంగా 160 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్లోని దిఘాకు తూర్పున 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తన బులెటిన్ లో పేర్కొంది.  

Low Pressure In Bay Of Bengal: బంగ్లాదేశ్ తీరంలో ఈశాన్య బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడి మంగళవారం ఉదయం 8.30 గంటలకు బంగ్లాదేశ్ తీరంలో ఈశాన్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఐఎండీ త‌న బులిటెన్ లో ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా మారిందని తెలిపింది. బంగ్లాదేశ్ లోని ఖేపుపారాకు తూర్పు-ఆగ్నేయంగా 160 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్లోని దిఘాకు తూర్పున 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. ఫలితంగా ఆగస్టు 3 నుంచి 6 వరకు వాయవ్య భారతంలో వర్షపాతం పెరుగుతుందనీ, రాబోయే మూడు రోజుల్లో కొంకణ్ తీరం, దానిని ఆనుకుని ఉన్న మధ్య మహారాష్ట్ర ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని ఐఎండీ తెలిపింది. అలాగే, రాబోయే ఐదు రోజుల పాటు ద్వీపకల్ప భారతంలో వర్షపాతం తగ్గుతుందని అంచనా వేసింది.

గంగానది పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ల‌లో ఆగస్టు 1 నుంచి 5 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్ర‌యివేటు వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. దేశంలోని తూర్పు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్ ఈ సీజన్ మొదటి అర్ధభాగంలో భారీ లోటును కూడబెట్టుకున్నాయి. ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల మూడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయనీ, సీజనల్ లోటును తగినంతగా తగ్గిస్తుందని స్కైమెట్ వెదర్ తెలిపింది. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వర్షపాతం సాధారణ పరిధిలోనే ఉంటుందనీ, దీర్ఘకాలిక సగటులో 94 నుంచి 106 శాతం మధ్య ఉంటుందని ఐఎండీ పేర్కొంది. అంటే రుతుపవనాల సీజన్ ద్వితీయార్ధంలో వర్షపాతం 100 శాతం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. జూలైలో సాధారణం కంటే 13 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా, దేశంలోని పలు ప్రాంతాల్లో మంచి వర్షపాతం నమోదైంది. ప‌లు ప్రాంతాల్లో వ‌ర‌ద‌లు సంభ‌వించాయి.

ఇదిలావుండ‌గా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్ర‌స్తుతం తీవ్ర అల్పపీడనంగా మారడంతో ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, బుధవారం మధ్యాహ్నం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది మంగళవారం సాయంత్రానికి వాయువ్య దిశగా పయనించి బంగ్లాదేశ్ తీరాన్ని ఖేపుపరాకు తూర్పుగా దాటే అవకాశం ఉందనీ, ఆ తర్వాత మరో 24 గంటల్లో గంగా నది పశ్చిమ బెంగాల్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని బులెటిన్ పేర్కొంది.

PREV
click me!

Recommended Stories

ఇండియాలో ఏ ఆవు ఎక్కువ పాలు ఇస్తుంది..? రోజుకు ఎన్ని లీటర్లో తెలుసా?
Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu