
పెరేంట్ కేడర్, నియామకంతో సంబంధం లేకుండా బ్రిగేడియర్ అంతకంటే పెద్ద ర్యాంక్ అధికారులకు భారత సైన్యం సాధారణ యూనిఫాం విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం బ్రిగేడియర్, ఆ పై స్థాయి అధికారులకు ఒకే తరహా యూనిఫాం ఉండబోతోతంది. ఇటీవల జరిగిన ఆర్మీ కమాండర్ల సమావేశంలో దీనిపై విస్తృత చర్చ, విస్తృత సంప్రదింపులు జరిగాయి.
సీనియర్ ఆఫీసర్ల హెడ్‌గేర్, షోల్డర్ ర్యాంక్ బ్యాడ్జెట్, జార్జెస్ ప్యాచెస్, బెల్ట్, షూస్‌లను స్టాండర్డ్‌యిజ్డ్ చేయనున్నట్లు భారత సైన్యం పేర్కొంది. కల్నల్స్, వారి కన్నా క్రింది స్థాయి సిబ్బంది యూనిఫాంలో మాత్రం ఎలాంటి మార్పులు వుండవని చెప్పాయి. సీనియర్ లీడర్‌షిప్ మధ్య సర్వీస్ విషయాల్లో రెజిమెంటేషన్ పరిధులకు అతీతంగా కామన్ ఐడెంటిటీని ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా భారత సైన్యం పేర్కొంది.
భారత సైన్యంలో, బ్రిగేడియర్ , పై అధికారులు ఇప్పటికే యూనిట్లు / బెటాలియన్‌లకు కమాండ్‌గా ఉన్నవారు ఎక్కువగా ప్రధాన కార్యాలయాలు / ఎస్టాబ్లిష్‌మెంట్స్‌గా నియమించబడ్డారు, ఇక్కడ అన్ని ఆయుధాలు, సేవల అధికారులు కలిసి పనిచేస్తారు. ప్రామాణిక యూనిఫాం భారత సైన్యం నైతికతను ప్రతిబింబిస్తూ సీనియర్ ర్యాంక్ అధికారులందరికీ ఉమ్మడి గుర్తింపు నిర్ధారిస్తుంది.