హర్యానాలో మతఉద్రిక్తతలు : కాలిపోయిన మసీదుకు 50 కి.మీ.దూరంలో ఉన్న గుడిపై అల్లరిమూకల దాడి.. ఆలయంలో 2,500మంది....

Published : Aug 01, 2023, 03:18 PM IST
హర్యానాలో మతఉద్రిక్తతలు : కాలిపోయిన మసీదుకు 50 కి.మీ.దూరంలో ఉన్న గుడిపై అల్లరిమూకల దాడి.. ఆలయంలో 2,500మంది....

సారాంశం

నూహ్‌లోని ఓ ఆలయంపై అల్లరిమూకలు దాడి చేశాయి. ఆ సమయంలో 2500మంది భక్తులు చిక్కుకున్నారు. అల్లరిమూకల రాళ్లదాడులు, తుపాకీ కాల్పులనుంచి ఆలయం వీరిని రక్షించింది. 

హర్యానా : నుహ్ లోని నల్హర్ మహాదేవ్ మందిర్ దగ్గర ఈ ఉదయం కనిపించిన దృశ్యాలు గత మధ్యాహ్నం 2,500 మంది గుంపు గుమిగూడి ఏమి చేశాయో చెబుతున్నాయి. గుడి చుట్టుపక్కలా.. అల్లరిమూకలు విసిరిన రాళ్ల కుప్పలు, తగులబెట్టిన  సాయుధ భద్రత బలగాల వాహనాలు బీభత్సంగా ఉంది. 

నూహ్ పట్టణానికి 7 కి.మీ దూరంలో ఉన్న ఈ ఆలయం చుట్టూ ఆరావళి పర్వతాలు అత్యంత సుందరంగా కనిపిస్తాయి. అలాంటి సుందరమైన కొండలపై కొద్ది గంటల ముందు  అల్లరి మూకలు గుమిగూడి కాల్పులు జరిపారు. రాళ్లు విసిరారు. ఆ సమయంలో ఆలయంలో ఉన్నవారు తీవ్రభయాందోళనలకు లోనయ్యారు. ఆ క్షణాల నుంచి బయటపడతామో లేదోనన్న ఆందోళన చెందారు. 

గురుగ్రామ్ లో మత ఉద్రిక్తత.. రెండు వర్గాల మధ్య ఘర్షణలో ముగ్గురి మరణం.. మృతుల్లో ఇద్దరు హోంగార్డులు..

నిన్న నుహ్ లో ప్రారంభమైన భారీ ఊరేగింపుకు ఈ ఆలయమే గమ్యస్థానం. సోమవారం విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన బ్రిజ్ మండల్ జలాభిషేక్ యాత్ర మత ఘర్షణకు దారితీసింది. ఇది నలుగురి ప్రాణాలను బలిగొంది. కనీసం 30 మంది గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది, ఇద్దరు పౌరులు, ఒక మసీదు మత గురువు కూడా ఉన్నారు.

ఆ తరువాత నుహ్, పొరుగున ఉన్న గురుగ్రామ్‌లో ఈ అల్లరి గుంపులు విధ్వంసం చేయడంతో మసీదును తగులబెట్టారు, అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. అల్లరిమూకలు రాళ్లు రువ్వారు, కాల్పులు జరిపారు.

దాదాపు 50 కి.మీ దూరంలో ఉన్న గుంపు గుడిని టార్గెట్ చేసింది. దాడి ప్రారంభమైన వెంటనే, స్థానిక పోలీసులు అల్లరిమూకల సంఖ్య ఎక్కువగా ఉందని గ్రహించారు. పారామిలటరీ బలగాలను రప్పించి గుడిలో చిక్కుకున్న వారిని సాయంత్రం కల్లా రక్షించారు. ఆలయాన్ని క్లియర్ చేశారు. పారామిలటరీ సిబ్బంది గట్టి నిఘా ఉంచారు. ఆలయం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు

తుపాకీ కాల్పులు, రాళ్ల దాడి నుండి సందర్శకులకు ఆలయం ఆశ్రయం కల్పించిందని ఆలయ పూజారి తెలిపారు. నిన్న జరిగిన హింసాకాండకు సంబంధించి 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. పలు పోలీసు కేసులు నమోదయ్యాయి. నివేదికల ప్రకారం, బజరంగ్ దళ్ నాయకుడు మోను మనేసర్ ఈ శోభాయాత్రలో ఉన్నారన్న పుకార్ల కారణంగా ఘర్షణలు చెలరేగాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో ఇద్దరు ముస్లిం యువకుల హత్యలో అతని పాత్రపై ఆరోపణలు వచ్చాయి.

PREV
click me!

Recommended Stories

Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే
Modi Putin Meeting: మోదీ, పుతిన్ భేటీతో మనకు జరిగేదేంటీ.? రష్యా ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంది.?