
చాక్లెట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. ముఖ్యంగా పిల్లలు అయితే దాని కోసం ఎగబడతారు. చాక్లెట్లు తినొద్దని పేరెంట్స్ ఎంత వారించినా అస్సలు వినరు. తమకు చాక్లెట్లే కావాలని మారం చేస్తారు. చివరికి పిల్లల పంతమే నెగ్గుతుంది. చాక్లెట్లు తింటే పళ్లు చెడిపోతాయాని, ఆరోగ్యం చెడిపోతుందని పిల్లలను తల్లిదండ్రులు హెచ్చరిస్తుంటారు. కానీ ఓ రాష్ట్రంలో ఏకంగా ఓ బాలుడి ప్రాణమే పోయింది. ఎందుకంటారా ? అయితే మీరు ఇది చదవాల్సిందే.
కరోనా కేసులు పెరుగుతున్నాయ్..!! తెలంగాణకు కేంద్రం అలర్ట్
బీహార్ లో రాష్ట్రంలో ఏడో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి చాక్లెట్ తిని చనిపోయాడు. ఈ ఘటన భోజ్ పూర్ జిల్లాలోని ఉద్వంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోన్ పురా గ్రామంలో వెలుగులోకి వచ్చింది. చనిపోయిన బాలుడిని శుభమ్ కుమార్ షాగా గుర్తించారు. అయితే కిరాణ షాప్ నిర్వాహకురాలే తమ కుమారుడికి విషపూరిత చాక్లెట్ ఇచ్చి చంపాడని బాలుడి తండ్రి సంతోష్ షా ఆరోపించారు.
తమ పిల్లాడు గురువారం సాయంత్రం తోటి పిల్లలతో ఆడుకుంటున్నాడని, ఆ సమయంలో కిరాణ షాప్ నిర్వాహకురాలు శుభమ్ కుమార్ కు చాక్లెట్ ఇచ్చిందని తండ్రి పేర్కొన్నారు. అయితే దానిని తిన్న తరువాత నుంచి బాలుడి ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించిందని ఆరోపించారు. తాము వెంటనే సుభమ్ ను అర్రాలోని సదర్ ఆసుపత్రికి తీసుకెళ్లామని, కానీ మార్గమధ్యంలోనే పిల్లాడు మరణించాడని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. శుభమ్ కుమార్ షాప్ నిర్వాహకురాలి పిల్లలతో గొడవ పడ్డాడని, దానిపై కోపం పెంచుకున్న మహిళ ఉద్దేశపూర్వకంగానే విషపూరిత చాక్లెట్ ఇచ్చిందని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో సంతోష్ షా గా పేర్కొన్నారు.
తమ బిడ్డ ఆరోగ్యం చెడిపోయినప్పుడు తాను వెంటనే ఆ మహిళ దుకాణానికి వెళ్ళానని, కానీ అప్పటికే ఆమె దానిని మూసివేసి, ఇంట్లోకి వెళ్లిపోయిందని తండ్రి సంతోష్ షా చెప్పారు. కానీ ఆ సమయంలో ఆమెతో గొడవ పడటం కన్నా..తన బిడ్డ ప్రాణాలే ముఖ్యం అనిపించి వెంటనే శుభమ్ ను అర్రాలోని సదర్ ఆసుపత్రికి తీసుకెళ్లానని తెలిపారు. కానీ అక్కడికి వెళ్లకముందే బాలుడు చనిపోయాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Sidhu Moose Walas Death: రాజకీయాలు ఆపండి.. సిద్దూ మూస్ వాలా హత్యపై కేజ్రీవాల్..
ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే సిటీ పోలీసు స్టేషన్ నుండి ఒక బృందం సదర్ ఆసుపత్రికి చేరుకుంది. పోస్ట్ మార్టం పరీక్షలు నిర్వహించింది. విషపూరిత పదార్థం తినడం వల్లే మరణం సంభవించిందని ఆ పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు కోసం ఉద్వంత్ నగర్ పోలీస్ స్టేషన్ కు దానిని బదిలీ చేశామని కేసు దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు.