రైడ్ చేస్తుండగా దుండగుల ఫైరింగ్.. ఏడుగురు పోలీసులకు గాయాలు

Published : Apr 28, 2023, 02:57 AM IST
రైడ్ చేస్తుండగా దుండగుల ఫైరింగ్.. ఏడుగురు పోలీసులకు గాయాలు

సారాంశం

రాజస్తాన్‌ పోలీసులు ఓ రౌడీ షీటర్ పట్టుకోవడానికి ఒక చోట రైడింగ్ చేయడానికి వెళ్లారు. పోలీసులు రైడింగ్ చేయడానికి వెళ్లగా నిందితులు, వారి బంధువులు పోలీసు చుట్టూ గుమిగూడారు. వారిపై రాళ్లు, కత్తులతో దాడికి దిగారు. కాల్పులు కూడా జరిపారు. ఈ ఘటనలో ఏడుగురు పోలీసులు గాయపడ్డారు.  

జైపూర్: రాజస్తాన్ పోలీసులు రైడ్ చేస్తుండగా దుండగులు ఫైరింగ్ జరిపారు. దీంతో ఏడుగురు పోలీసులు గాయపడ్డారు. ఉదయ్‌పూర్‌లోని మాండ్వా ఏరియాలో ఈ ఘటన జరిగింది. రానియా గ్యాంగ్‌కు చెందిన ఓ రౌడీ షీటర్‌ను పట్టుకోవడానికి పోలీసులు వెళ్లినప్పుడు ఫైరింగ్ జరగ్గా పోలీసులు గాయపడ్డారు.

పోలీసు టీమ్ అక్కడికి వెళ్లగానే కత్తులు, రాళ్లతో దాడి చేశారని ఆరోపించారు. నిందితులు పోలీసుల వద్ద నుంచి ఎస్ఎల్ఆర్ రైఫిల్, పిస్టల్ కూడా లాక్కోవాలని ప్రయత్నించినట్టు ఉదయ్ పూర్ రేంజ్ ఐజీ అజయ్ పాల్ లాంబా తెలిపారు. ఈ దాడిలో ఏడుగురు పోలీసులు గాయపడ్డారు. వారిని ఉదయ్‌పూర్‌లోని ఎంబీ హాస్పిటల్‌కు తరలించారు. కానిస్టేబుల్ మనోజ్ పరిస్థితి విషమంగా ఉన్నది.

మాండ్వా ఏరియాలో ఓ దొంగతనం కేసు రిపోర్ట్ అయిందని, అందుకే పోలీసులు అక్కడికి వెళ్లారని ఐజీ లాంబా తలిపారు. ఆ ఏరియాలోనే నిర్మించిన ఓ ఇంటిలో నిందితులు ఉన్నట్టు తమకు సమాచారం వచ్చిందని వివరించారు.

అయితే, పోలీసులు అక్కడికి వెళ్ల గానే అన్ని వైపుల నుంచి నిందితులు బంధువులు గుమిగూడి వారి నుంచి ఆయుధాలను లాక్కునే ప్రయత్నం చేశారు. గ్రామస్తులు అక్కడ పోలీసులపై దాడి చేయగా నిందితులు పారిపోయారు.

Also Read: 25 ఏళ్లు విడిగా ఉంటున్న దంపతులు విడాకులు కావాలన్నారు.. సుప్రీంకోర్టు ఏమన్నదంటే?

కత్తులు, కర్రలు పట్టుకుని పోలీసులపై వారు దాడి చేశారు. నిందితులు పోలీసు అధికారులపై కాల్పులు జరిపారు. గ్రామస్తులు శాంతియుతంగా ఉండాలని, పోలీసులతో సహకరించాలని కోరారు.

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu