సీఎం పాల్గొనబోతున్న కార్యక్రమ వేదికకు నిప్పు పెట్టిన మూక.. మణిపూర్‌లో ఘటన

Published : Apr 28, 2023, 02:25 AM IST
సీఎం పాల్గొనబోతున్న కార్యక్రమ వేదికకు నిప్పు పెట్టిన మూక.. మణిపూర్‌లో ఘటన

సారాంశం

మణిపూర్‌లో సీఎం పాల్గొనబోయే కార్యక్రమ వేదికను ఓ మూక ధ్వంసం చేసింది. చురచాంద్‌పూర్‌లో వేదికను, దాని ఎదుట వేసిన వందలాది కుర్చీలకు నిప్పు పెట్టింది. అలాగే, రేపు సీఎం ప్రారంభించబోతున్న ఓపెన్ జిమ్‌కూ నిప్పు పెట్టి పాక్షికంగా ధ్వంసం చేసింది.  

ఇంఫాల్: మణిపూర్ రాష్ట్రంలో ఓ మూక సీఎం ఎన్ బీరెన్ సింగ్ శుక్రవారం పాల్గొనబోయే కార్యక్రమ వేదికకు నిప్పు పెట్టింది. గురువారం రాత్రి చురచాంద్‌పూర్ జిల్లాలోని న్యూ లంకాలో ఈ ఘటన జరిగింది. శుక్రవారం ఆ వేదిక పై సీఎం ఎన్ బీరెన్ సింగ్ ఆసీనులు కావాల్సి ఉంది. కానీ, గురువారం రాత్రే దానికి నిప్పు పెట్టారు. అలాగే, అక్కడే సీఎం బీరెన్ సింగ్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న ఓపెన్ జిమ్‌నూ ఆ మూక పాక్షికంగా ధ్వంసం చేసింది.

లోకల్ పోలీసులు వెంటనే కార్యరంగంలోకి దూకారు. ఆ మూకను చెదరగొట్టారు. కానీ, ఆ వేదికతోపాటు వందలాది కుర్చీలు ధ్వంసం అయ్యాయి. 

సీఎం బీరెన్ సింగ్ పాల్గొనబోయే వేదికతోపాటు అక్కడే ఓపెన్ జిమ్ ఏర్పాట్లకూ నిప్పు పెట్టారు. న్యూ లంకాలోని పీటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ ఓపెన్ జిమ్‌ను శుక్రవారం సీఎం బీరెన్ సింగ్ ప్రారంభించాల్సింది. కానీ, ఆ ఓపెన్ జిమ్‌ను మూక నిప్పు పెట్టి పాక్షికంగా ధ్వంసం చేసింది. ఈ జిమ్ ఓపెనింగ్‌తోపాటు స్థానిక సద్బావన మండప్ నిర్వహించే ఓ పంక్షన్‌కూ సీఎం రేపు వెళ్లాల్సిన షెడ్యూల్ ఉన్నది.

Also Read: భార్యను ముక్కలుగా నరికి నిప్పు పెట్టాడు.. ఆ ల్యాండ్ లీజుకు తీసుకున్న వ్యక్తి ఫిర్యాదు తో కేసు నమోదు

ఓ ఇండిజీనస్ ట్రైబ్ లీడర్స్ ఫోరమ్ చురచాంద్‌పూర్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంద్ పిలుపు ఇచ్చింది. ఈ నేపథ్యం లోనే  ఓ మూక ఈ ఘటనకు పాల్పడింది. రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏరియా నుంచి రైతులను, ఇతర గిరిజనులను బయటకు పంపే కార్యక్రమాన్ని నిరసిస్తూ తాము ప్రభుత్వా నికి ఎన్నో మెమోరాండంలు అందిం చామని ఆ ఫోరమ్ చెప్పింది. కానీ, ప్రభుత్వం మాత్రం అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆలకించడానికీ అయిష్టత చూపె ట్టిందని వివరించింది. అందుకే సీఎం పర్యటన నేపథ్యంలో చురచాంద్‌పూర్ బంద్‌కు పిలుపు ఇచ్చింది.

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu