రాజస్థాన్ కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి భన్వర్ లాల్ శర్మ క‌న్నుమూత‌

By team teluguFirst Published Oct 9, 2022, 1:57 PM IST
Highlights

రాజస్థాన్ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భన్వర్ లాల్ శర్మ అనారోగ్యంతో చనిపోయారు. ఆయన ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 

రాజస్థాన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భన్వర్ లాల్ శర్మ (77) జైపూర్‌లోని ఎస్‌ఎంఎస్ మెడికల్ కాలేజీలో ఆదివారం కన్నుమూశారు. సర్దార్‌షహర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పని చేశారు. ఆయ‌న ధీర్ఘ‌కాలికంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతుండ‌గానే ప‌రిస్థితి విష‌మించ‌డంతో చ‌నిపోయారు. 

టిప్పు సుల్తాన్ బీజేపీని చికాకు పెడుతున్నాడు - ఏఐఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఒవైసీ..

ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన భ‌న్వ‌ర్ లాల్ శ‌ర్మ‌కు ప్ర‌స్తుతం 77 సంవత్స‌రాలు. ఆయ‌న 1945 ఏప్రిల్ 17వ తేదీన సర్దార్‌షహర్‌లోని జైత్‌సీర్ గ్రామంలో జన్మించారు. 17 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి రంగ ప్ర‌వేశం చేశారు. సర్పంచ్ ప‌ద‌వి నుంచి ఆయ‌న రాజ‌కీయ ప్ర‌స్థానం మొద‌లైంది. శ‌ర్మ మంత్రిగా కూడా సేవ‌లు అందించారు.

ముస్లింల కంటే రోడ్డు మీద ఉన్న శునకాలకే ఎక్కవ గౌరవం.. అసదుద్దీన్ ఒవైసీ

ఆయ‌న మొద‌ట‌గా 1985లో లోక్‌దళ్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనంత‌రం 1990లో జనతాదళ్ పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచి కూడా ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. త‌రువాత కాంగ్రెస్ లో చేరారు. అదే పార్టీ నుంచి 1998, 2003, 2013, 2018 సంవత్సరాల్లో అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందారు.

परशुराम भवन, विद्याधर नगर (जयपुर) पहुंचकर सरदारशहर विधायक स्व. श्री भंवरलाल शर्मा की पार्थिव देह पर पुष्पचक्र अर्पित कर श्रद्धांजलि दी और दिवंगत आत्मा की शान्ति के लिए प्रार्थना की एवं शोकाकुल परिजनों से मिलकर उन्हें ढांढस बंधाया। pic.twitter.com/j0dyymXdk0

— Ashok Gehlot (@ashokgehlot51)

కాగా.. ఆయ‌న మృతి ప‌ట్ల రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విచారం వ్యక్తం చేశారు. ‘‘ సర్దార్‌షహర్ (చురు) కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మ మరణించినందుకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో ఉన్నారు. నేను ఆయ‌న ఆరోగ్య స‌మాచారాన్ని తెలుసుకునేందుకు కుటుంబ స‌భ్యుల‌తో స‌న్నిహితంగా ఉన్నాను. ఆయ‌న యోగ‌క్షేమాలు తెలుసుకునేందుకు నిన్నఎస్ఎంఎస్ హాస్పిట‌ల్ కు వెళ్లాను. ’’ అని ఆయ‌న ట్వీట్ చేశారు. 

सरदारशहर (चूरू) से कांग्रेस विधायक श्री भंवरलाल शर्मा के निधन पर मेरी गहरी संवेदनाएं। काफी समय से वो अस्वस्थ चल रहे थे, उनके स्वास्थ्य को लेकर मैं उनके परिवारजनों के सम्पर्क में था, कल रात एसएमएस अस्पताल पहुंचकर चिकित्सकों से जानकारी ली और परिवार से मुलाकात की थी। pic.twitter.com/3DZXVC1lK2

— Ashok Gehlot (@ashokgehlot51)

ఈ క్లిష్ట సమయంలో మృతుడి కుటుంబాలకు మనోధైర్యాన్ని అందించాలని, మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని ఆయన మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.
 

click me!