ఉత్తరప్రదేశ్‌లో విద్యుదాఘాతంతో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు దుర్మరణం

Published : Oct 09, 2022, 12:47 PM IST
ఉత్తరప్రదేశ్‌లో విద్యుదాఘాతంతో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు దుర్మరణం

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లో విద్యుదాఘాతంతో ఐదుగురు మరణించారు. ఐరన్ రాడ్‌ను వేసుకుని ఎడ్ల బండిలో ప్రయాణిస్తున్న వారు.. హై టెన్షన్ కరెంట్ వైర్లతో కాంటాక్ట్ అయ్యారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. కరెంట్ షాక్‌తో ఐదుగురు దుర్మరణం చెందారు. ఇందులో ముగ్గురు చిన్నారులు ఉండటం గమనార్హం. బహ్రెయిచ్ జిల్లాలో నాన్‌పార ఏరియాలో మాసుపూర్ గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. హైటెన్షన్ కరెంట్ వైర్‌లతో బాధితులు కాంటాక్ట్‌లోకి రావడంతో ఈ ఘటన జరిగింది.

బాధితులు సహా మరికొందరు ఎడ్ల బండి పై వెళ్లుతున్నారు. ఆ ఎడ్ల బండిలో ఐరన్ రాడ్ కూడా వెంట తీసుకెళ్లుతున్నారు. మాసుపూర్ గ్రామంలో ఉదయం 4 గంటలకు వారు వెళ్లుతుండగా హై టెన్షన్ కరెంట్ వైర్లు కాంటాక్టులోకి వచ్చినట్టు స్థానికులు చెప్పారు.

ఈ ఘటనను అడిషనల్ ఎస్పీ రూరల్ అశోక్ కుమార్  ఈ ఘటనను ధ్రువీకరించారు. నలుగురు వ్యక్తులు స్పాట్‌లోనే మరణించారని వివరించారు. మరొకరు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ పరిస్థితులు విషమించి మరణించారు. పలువురికి కరెంట్ షాక్ కారణంగా గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి నిలకడగా ఉన్నదని ఆ పోలీసు అధికారి వివరించారు. ఈ ఘటనపై సీఎం యోగి ఆదత్యానాథ్ స్పందించారు. గాయపడిన వారికి వెంటనే చికిత్స అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు.

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు