లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రాజేష్ దాస్.. మూడేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు

Published : Jun 16, 2023, 04:33 PM IST
లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రాజేష్ దాస్.. మూడేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు

సారాంశం

లైంగిక వేధింపుల కేసులో తమిళనాడుకు చెందిన మాజీ అదనపు డీజీపీ, ఐపీఎస్ రాజేష్ దాస్ దోషిగా తేలారు. ఆయనకు కోర్టు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు రూ.10 వేల జరిమానా వేసింది. 

లైంగిక వేధింపుల కేసులో సస్పెండైన సీనియర్ ఐపీఎస్ అధికారిని తమిళనాడులోని స్థానిక కోర్టు దోషిగా తేల్చింది. తోటి జూనియర్ మహిళా అధికారిని లైంగికంగా వేధించిన కేసులో విల్లుపురం కోర్టు మాజీ అదనపు డీజీపీ రాజేశ్ దాస్ కు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు 10 వేల జరిమానా కూడా విధించింది. అయితే ఆయనకు బెయిల్ మంజూరు చేసిన కోర్టు అప్పీలుకు 30 రోజుల గడువు ఇచ్చింది.

ఆపరేషన్ చేసి, కత్తెరను లోపలే వదిలేయడంతో రోగి మృతి.. దహన సంస్కారాల అనంతరం, బూడిదలో దొరకడంతో వెలుగులోకి..

దాస్ 2021 ప్రారంభంలో స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) గా ఉన్నప్పుడు తనను లైంగికంగా వేధించారని మహిళా పోలీసు సూపరింటెండెంట్ ఆరోపించారు. దీనిపై కేసు నమోదు అయ్యింది. అప్పటి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి భద్రత కోసం డ్యూటీలో ప్రయాణిస్తున్నప్పుడు దాస్ తనను లైంగికంగా వేధించారని మహిళా ఐపీఎస్ అధికారి తన ఫిర్యాదులో ఆరోపించారు. అయితే ఆ సమయంలో తోటి అధికారులు ఆమెను ఫిర్యాదు చేయకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ ఆమె వెనకడుగు వేయకుండా ఫిర్యాదు చేశారు.

ఆమె ఫిర్యాదును గత అన్నాడీఎంకే ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దాస్ ను సస్పెండ్ చేసింది. తరువాత ఆ ఐపీఎస్ అధికారిపై వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆరుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ పోలీసు సిబ్బందితో సహా 68 మంది వాంగ్మూలాలను నమోదు చేసింది. తాజాగా ఈ కేసులో రాజేశ్ దాస్ ను కోర్టు దోషిగా తేల్చింది. అయితే కోర్టు తీర్పుపై అప్పీల్ చేసుకోవచ్చని, తక్షణ బెయిల్ పొందవచ్చని ప్రాసిక్యూషన్ తెలిపింది.

బంగ్లాదేశ్ లో భూకంపం.. భారత్ లోని అసోం, ఈశాన్య రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు

కాగా.. ఈ లైంగిక వేధింపుల కేసు 2021లో పెద్ద ఎన్నికల అంశంగా మారింది. తాము అధికారంలోకి వస్తే తగిన చట్టపరమైన ప్రక్రియ, శిక్ష విధిస్తామని అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హామీ ఇచ్చిన విషయం ఇచ్చారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం