900 గ్రామాలకు నిలిచిపోయిన విద్యుత్.. నేలకూలిన 524 చెట్లు.. గుజరాత్ లో బీభత్సం సృష్టిస్తున్న బిపార్జోయ్ తుఫాన్

Published : Jun 16, 2023, 03:48 PM IST
900 గ్రామాలకు నిలిచిపోయిన విద్యుత్.. నేలకూలిన 524 చెట్లు.. గుజరాత్ లో బీభత్సం సృష్టిస్తున్న బిపార్జోయ్ తుఫాన్

సారాంశం

బిపార్జోయ్ తుఫాను వల్ల గుజరాత్ అతలాకుతలం అవుతోంది. ఈదురుగాలుల వల్ల భారీ సంఖ్యలో చెట్లు నేలకూలాయి. అలాగే 300కు పైగా కరెంటు పోల్స్ పడిపోయాయి. దీంతో 900 గ్రామాలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. 

బిపార్జోయ్ తుపాను గుజరాత్ లో బీభత్సం సృష్టింస్తోంది. ఈ తుఫాన్ ప్రభావం వల్ల 300కు పైగా విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి, సుమారు 900 గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. బలమైన ఈదురు గాలులకు విద్యుత్ తీగలు, స్తంభాలు తెగిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. అయితే విద్యుత్ సౌకర్యాన్నిపునరుద్ధరించేందుకు పీజీవీసీఎల్ ప్రయత్నిస్తోంది.

ఆపరేషన్ చేసి, కత్తెరను లోపలే వదిలేయడంతో రోగి మృతి.. దహన సంస్కారాల అనంతరం, బూడిదలో దొరకడంతో వెలుగులోకి..

కాగా, తుపాను ధాటికి మొత్తం 22 మందికి గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో 23 జంతువులు ప్రాణాలు కోల్పోయాయి. ఈదురుగాలుల వల్ల 524 చెట్లు నేలకూలాయి. కాగా.. ఈ బిపర్జోయ్ తుఫాను తూర్పు-ఈశాన్య దిశగా కదులుతూ గుజరాత్లోని భుజ్కు 30 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తెలిపింది. సాయంత్రానికి ఇది సౌరాష్ట్ర, కచ్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనంగా మారుతుందని, గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ డీజీ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు.

రాజస్థాన్ లోని బార్మర్, జలోర్, జైసల్మేర్, సిరోహి, జోధ్పూర్, పాలి, పరిసర ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేసింది.
ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో జోద్ పూర్ డివిజన్ లోని అన్ని కళాశాలల్లో శుక్ర, శనివారాల్లో జరగాల్సిన అన్ని పరీక్షలను జోధ్ పూర్ యూనివర్సిటీ వాయిదా వేసింది. గుజరాత్ తీరంలో 'బిపర్జోయ్' తుపాను బీభత్సం సృష్టించిన నేపథ్యంలో ద్వారకా జిల్లాలోని రూపెన్ బందర్ లోని లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ఇద్దరిని ఎన్డీఆర్ఎఫ్ బృందం రక్షించింది.

‘అలా చేస్తే రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయబోం’ - కాంగ్రెస్ కు ఆప్ మెగా ఆఫర్

‘బిపార్జోయ్’ తుఫాను గుజరాత్ తీరాన్ని తాకిన తర్వాత భుజ్ లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రోడ్ క్లియరెన్స్ ఆపరేషన్ చేపట్టారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ గాంధీనగర్ లోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ లో బిపర్జోయ్ తుఫాను ప్రభావాన్ని అంచనా వేశారు. గుజరాత్ లోని కచ్ జిల్లాలోని కోస్తా పట్టణంలో వర్షాలు కురుస్తుండటంతో మాండ్విలో నేలకూలిన చెట్లను తొలగించేందుకు ఎర్త్ మూవింగ్ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. బిపార్జోయ్ తుపాను గుజరాత్ తీరాన్ని తాకడంతో భుజ్ లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.

బంగ్లాదేశ్ లో భూకంపం.. భారత్ లోని అసోం, ఈశాన్య రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు

అయితే ఈ తుఫాను వల్ల కచ్ జిల్లాలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగిన దాఖలాలు లేవు. ప్రస్తుతం ముంద్రా, జఖువా, కోటేశ్వర్, లక్ఫత్, నలియా ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. బిపర్జోయ్ తుఫాను కారణంగా దక్షిణ రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !