సీమా హైదర్ కేసులో మళ్లీ ట్విస్ట్.. ఏం జరిగిందంటే ?

By Sairam Indur  |  First Published Feb 17, 2024, 11:59 AM IST

పాకిస్థాన్ నుంచి యూపీలోని తన ప్రియుడు సచిన్ మీనాను కలవడానికి అక్రమంగా భారత్ లోకి ప్రవేశించి, ఇక్కడే సహజీవనం చేస్తున్న సీమా హైదర్ (Seema Haider) కేసులో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. తన పిల్లలను తనకు అప్పగించాలని కోరుతూ ఆమె మొదటి భర్త న్యాయ పోరాటం ప్రారంభించారు.


సీమా హైదర్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. 2023 లో తన నలుగురు పిల్లలతో అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ మొదటి భర్త గులాం హైదర్ తన పిల్లలను తిరిగి పొందేందుకు న్యాయ పోరాటం ప్రారంభించారు. తన మైనర్ పిల్లలను తనకు ఇప్పించాలని కోరుతూ ఆయన పాకిస్తాన్ న్యాయవాది, మానవ హక్కుల కార్యకర్త అన్సార్ బర్నీ సహాయం కోరారు. దీనికి ఆయన అంగీకరించారు. 

బర్నీ.. భారతీయ న్యాయవాది అలీ మోమిన్ ను దీని కోసం నియమించుకున్నారు. దీంతో భారత కోర్టుల్లో చట్టపరమైన చర్యలు ప్రారంభమయ్యాయని బర్నీ వెల్లడించారు. యూపీలోని సచిన్ మీనాతో సీమా భారత్ లో స్థిరపడినప్పటికీ, పిల్లలు పాకిస్థానీ పౌరులు కావడం, వారి ఇంకా మైనర్ లే కావడం ఈ కేసుకు బలంగా మారింది. మైనర్ పిల్లల మతమార్పిడికి సంబంధించి అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన జరిగిందని న్యాయవాది వర్నీ చెప్పారు. ఇదే ఈ కేసుకు కీలక పాయింట్ అని తెలిపారు.

Latest Videos

undefined

గులాం హైదర్ కు తన పిల్లలను పాకిస్థాన్ కు తీసుకురావడమే లక్ష్యమని, తిరిగి సీమతో కలిసి ఉండాలన్న కోరిక ఆయనకు లేదని స్పష్టం చేశారు. ఈ పరిణామాలపై భారత్ లో సీమా హైదర్, సచిన్ మీనా న్యాయ ప్రతినిధి న్యాయవాది ఏపీ సింగ్ అసహనం వ్యక్తం చేశారు.

కాగా. పబ్జీ గేమ్ ద్వారా యూపీలోని సచిన్ మీనాకు, సీమా హైదర్ కు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కొన్ని రోజుల తరువాత ప్రేమగా మారింది. దీంతో సీమా నేపాల్ మీదుగా భారత్ కు చేరుకుంది. ఆ సమయంలో ఇది అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పోలీసు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఎటిఎస్) దర్యాప్తులో ఉన్న సీమా, మీనా కేసు 2023 జూలైలో వెలుగుచూసింది. తరువాత వారిద్దరినీ పోలీసులు అరెస్టు చేవారు. కొంత కాలంలోనే వారిద్దరూ బెయిల్ పై విడుదల అయ్యారు. అప్పటి నుంచి సహజీవనం చేస్తున్న ఈ జంటను స్థానిక పోలీసులు, యూపీ ఏటీఎస్ వేర్వేరుగా విచారిస్తున్నాయి.

click me!