వెల్లుల్లి ధరలు ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో పొలాల్లోనే వాటి చోరీ జరుగుతోంది. దీనిని నివారించేందుకు మధ్యప్రదేశ్ లోని చింద్వారా జిల్లాలోని రైతులు టెక్నాలజీ సాయం తీసుకుంటున్నారు. పొలంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని పహారా కాస్తున్నారు.
సాధారణంగా సీసీ కెమెరాలు ఆఫీసుల్లో, ఇళ్లల్లో, షాపుల్లో, బ్యాంకుల్లో కనిపిస్తుంటాయి. కానీ చేన్లలో, పంట పొలాల్లో వీటిని ఏర్పాటు చేయడం ఎప్పుడైనా చూశారా ? లేదు కదా.. కానీ వెల్లుల్లి ధరలు రికార్డు స్థాయి గరిష్టానికి చేరడంతో ఇప్పుడు పంట పొలాల్లోకి సీసీ కెమెరాలు వచ్చేశాయి. పొలంలో నుంచి పంట చోరీకి గురి కాకుండా ఉండేందుకు రైతులు టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు.
యువరాజ్ సింగ్ ఇంట్లో చోరీ.. భారీగా నగదు, ఆభరణాల దొంగతనం..
undefined
వెల్లుల్లి ధరలు ఆకాశాన్నంటాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా కిలో రూ.500 ధర పలుకుతోంది. దీంతో ఈ పంట సాగు చేసిన రైతులకు భారీగా ఆదాయం వస్తోంది. అయితే వెల్లుల్లి ధరలు పెరిగిపోవడంతో పంట పొలాల్లో చోరీలు కూడా జరిగే అవకాశం ఉంది. అలా జరగకుండా చూసేందుకు రైతులు అందివచ్చిన టెక్నాలజీని వాడుకుంటున్నారు. పొలంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.
లెజెండరీ చెఫ్, పద్మ శ్రీ గ్రహీత ఖురేషీ ఇకలేరు.. సోషల్ మీడియాలో నివాళుల వెల్లువ..
మధ్యప్రదేశ్ లోని చింద్వారా జిల్లాలోని పొల్లాల్లో ఈ దృష్యాలు కనిపించాయి. ఇక్కడి రైతులు అధికంగా వెల్లుల్లి పండిస్తుంటారు. అయితే గతంలో ఎప్పుడూ లేనంతగా వీటి ధరలు పెరగడంతో రైతుల ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. అక్కడి హోల్ సేల్ వ్యాపారులు పొలం వద్దనే కిలో రూ.400 చొప్పున వెల్లుల్లిని కొనుగోలు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్ లో వీటిని రూ.500 చొప్పున అమ్ముకుంటున్నారు.
నూట పది రూపాయిలిచ్చి రోజూ నిలబడి పోవాల్నా..? బస్సులో యువకుడి ఆవేదన.. వైరల్
ఈసారి వెల్లుల్లితో రైతులకు లక్షల్లో ఆదాయం వస్తోంది. దీంతో దొంగతనాలు కూడా జరుగుతున్నాయి. రాత్రి సమయంలో, పొలంలో ఎవరూ లేని సమయంలో వెల్లుల్లి పంటను దొంగలు ఎత్తుకెళ్తున్నారు. ఈ చోరీలను అరికట్టేందుకు రైతులు తమ పొలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. అవి సోలార్ ద్వారా, రాత్రి సమయాల్లో బ్యాటరీ ద్వారా నడుస్తాయి. అనుమాస్పదంగా అనిపిస్తే వెంటనే అలెర్ట్ మెసేజ్ పంపించంతో అలారం కూడా మోగుతుంది. దీంతో చోరీలు తగ్గిపోతున్నాయి.