
ముంబయి: మహారాష్ట్రలో ఓ వివాహేతర సంబంధం విషాదంగా ముగిసింది. నవి ముంబయిలో ఓ హౌజింగ్ కాంప్లెక్స్‌కు సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న 40 ఏళ్ల వ్యక్తితో ఓ వివాహిత అక్రమ సంబంధం పెట్టుకుంది. తనను పెళ్లి చేసుకోవాలని తరుచూ ఆమె అతడిని డిమాండ్ చేసేది. పెళ్లి డిమాండ్ అతడికి నచ్చేది కాదు. ఈ డిమాండ్ తరుచూ చేస్తున్న ఆ మహిళను శాశ్వతంగానే లేకుండా చేయాలని నిశ్చయించుకున్నాడు. అనుకున్నట్టే ఆమెను తను పని చేసే చోటుకి రప్పించి గొంతు నులిమి చంపేశాడు. నిందితుడు రాజ్ కుమార్ బాబురామ్ పాల్‌ను మంగళవారం అరెస్టు చేసినట్టు పోలీసులు గురువారం వెల్లడించారు.
35 నుంచి 40 ఏళ్ల వయసులో ఉండే ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని ఫిబ్రవరి 12వ తేదీన పోలీసులు రికవరీ చేసుకున్నారు. థానే జిల్లా నవీ ముంబయి పట్టణంలోని కొపర్‌ఖైర్నే ఏరియాలో ఓ హౌజింగ్ సొసైటీ సమీపంలోని చెట్ల పొదలల్లో ఈ డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నట్టు సీనియర్ పోలీసు ఇన్‌స్పెక్టర్ విశ్వనాథ్ కోలేకర్ వివరించారు.
ఆ మహిళను చున్నీతో గొంతు నులిమి చంపేశారని వివరించారు. హత్య సాక్ష్యాధారాలను నాశనం చేయడానికే మృతదేహాన్ని ఆ చెట్ల పొదల్లో పడేసినట్టు వివరించారు. డెడ్ బాడీని పోస్టుమార్టానికి పంపి గుర్తు తెలియని వ్యక్తిపై మర్డర్ సహా ఇతర సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.
ఈ సమచారాన్ని నవీ ముంబయి పోలీసులు మహారాష్ట్రలోని అన్ని పోలీసు స్టేషన్‌లకు పంపించారు. ముంబయి సమీపంలోని త్రోంబాయ్ పోలీసు స్టేషన్‌లో నమోదైన ఓ మిస్సింగ్ కంప్లైంట్ ఈ కేసును ఛేదించడానికి ఉపకరించింది. నవి ముంబయిలో లభించిన డెడ్ బాడీ పోలికలు.. అక్కడ మిస్ అయినట్టు నమోదైన వ్యక్తి పోలికలు సరిపోయాయి. పోలీసులు వెంటనే దర్యాప్తు ముమ్మరం చేశారు.
Also Read: వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్: విచారణ ఈ నెల 27కి వాయిదా
పోలీసులు ఆ అదృశ్యమైన మహిళ కుటుంబ సభ్యులను దర్యాప్తు చేశారు. ఆమె ముంబయిలోని మాన్‌ఖుర్త్ ఏరియాలో క్లీనర్‌గా పని చేసేదని ఆమె భర్త తెలిపాడు. కొన్ని రోజులుగా ఆమె కనిపించకుండా పోయిందని చెప్పాడు.
పోలీసులు ఆ తర్వాత బాధితురాలి మొబైల్ ఫోన్ కనుగొన్నారు. ఆ తర్వాత ఆమె తో సెక్యూరిటీ గార్డ్ పాల్ లవ్‌లో ఉన్నట్టు గుర్తించారు.
పాల్‌ను అరెస్టు చేసి విచారించగా.. ఆమె తనను పెళ్లి చేసుకోవాలని తరుచూ వేధించేదని, అందుకే చంపేశానని అంగీకరించారు.