అనుమానిత వ్యక్తుల కదలికలు: ముఖేష్ అంబానీ వద్ద భద్రత కట్టుదిట్టం

By narsimha lodeFirst Published Nov 8, 2021, 8:46 PM IST
Highlights

ముంబైలో ఇధ్దరు వ్యక్తుల కదలికలకు సంబంధించిన సమాచారం ఆధారంగా పోలీసులు ముఖేష్ అంబానీ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. 


ముంబై:పారిశ్రామికవేత్త Mukesh Ambani నివాసం యాంటిలియా వద్ద పోలీసులు బందోబస్తును పెంచారు. ఇద్దరు అనుమానాస్పద వ్యక్తుల గురించి ఓ టాక్సీ డ్రైవర్ ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వడంతో అంబానీ నివాసం వద్ద భద్రతను పెంచారు. ఇవాళ మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తులు ముఖేష్ అంబానీ నివాసం అడ్రస్ అడిగినట్టుగా డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించారు.ఆజాద్ మదన్ సమీపంలో వ్యాగన్ కారులో ఇద్దరు వ్యక్తులు  అంబానీ ఇంటి అడ్రస్ ను అడిగారని  Taxi Driver పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

also read:అంబానీ ఇంటికి బెదిరింపుల కేసు: ‘‘బాలాజీ కుర్కురే’’ పేరిట పరమ్ బీర్ సింగ్ ఛాటింగ్

ఫోన్ యాప్ లో ముఖేష్ అంబానీ ఇంటి అడ్రస్ గురించి సెర్చ్ చేయాలని తాను సూచిస్తే తమ వద్ద ఫోన్ యాప్ లేదని చెప్పి అక్కడి నుండి ఆ ఇద్దరు వ్యక్తులు వెళ్లిపోయారని టాక్సీ డ్రైవర్ పోలీసులకు  వివరించారు.టాక్సీ డ్రైవర్ నుండి ఈ విషయమై మరింత సమాచారం రాబట్టేందుకు ముంబై పోలీసులు ప్రయత్నిస్తున్నారు.ముఖేష్ అంబానీ ఇంటి అడ్రస్ గురించి వాకబు చేసిన ఇద్దరు వ్యక్తుల గురించి ముంబై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మేరకు సీసీటీవీ పుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.

ముఖేష్ అంబానీ ఇంటి వద్ద ఈ ఏడాది ఫిబ్రవరి 25న  జిలెటిన్ స్టిక్స్ తో కూడిన కారు కలకలం  రేపింది. ఈ కారు అదే నెల 18వ తేదీన చోరీకి గురైంది.  ఈ కేసు  పెద్ద సంచలనంగా మారింది. ఈ కేసులో Sachin Waze నిందితుడిగా గుర్తించారు. సచిన్  వాజేను సస్పెండ్ చేశారు. ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. ఈ కేసును ఎన్ఐఏ విచారిస్తోంది.

ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ గా సచిన్ వాజేకు పేరుంది. అయితే కొంతకాలం క్రితం ఆయనను విధుల నుండి  సస్పెండ్ చేశారు. 16 ఏళ్ల తర్వాత 2020లో ఆయన విధుల్లో చేరాడు.2002లో 27 ఏళ్ల ఖ్వాజా యూనస్ అనే ఇంజనీర్‌ను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఆ సంవత్సరం ఘట్కోపర్ ప్రాంతంలో జరిగిన బాంబు దాడి కేసులో అతడిని ఉగ్రవాద నిరోధక చట్టం కింద అదుపులోకి తీసుకున్నారు.

బాంబు పేలుడుతో సంబంధం ఉందనే ఆరోపణలతో యూనస్, మరో ముగ్గురు వ్యక్తులను విచారించారు. ఆ తరువాత యూనస్ కనిపించకుండా పోయాడు. అతడిని జైళ్లో కొట్టి చంపారనే ఆరోపణలతో సచిన్, మరో ముగ్గురు పోలీసులను విధుల నుంచి తొలగించారు. ఈ కేసును విచారిస్తున్న జడ్జి 2018లో బదిలీపై వెళ్లారు. ఆ తరువాత సచిన్‌ను మళ్లీ విధుల్లోకి తీసుకున్నారు.

సచిన్ వాజే 1990లో పోలీసు విభాగంలో చేరారు. అతడికి మొదటి పోస్టింగ్ గచ్చిరోడీలో ఇచ్చారు. ఆ తరువాత థానేకు, ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో చాలామంది నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు. యూనస్ కేసు తరువాత ఆయన సస్పెండ్ అయ్యారు. 2007లో ముంబై పోలీస్ విభాగంలో చేరేందుకు అర్జీ పెట్టుకున్నారు

ఈ ఏడాది ఫిబ్రవరి 25న పేలుడు పదార్దాలున్న కారు ఘటన మర్చిపోకముందే ఇద్దరు అనుమానితులు ముఖేష్ అంబానీ ఇంటి అడ్రస్ అడిగిన సమాచారం తెలియడంతో పోలీసులు ఈ ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. నగరంలోని సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.

click me!