COVID-19: మ‌రోసారి క‌రోనా క‌ల‌క‌లం.. అప్ర‌మ‌త్త‌మైన యూపీ.. ఆ న‌గ‌రంలో 144 సెక్షన్ అమ‌లు

Published : May 02, 2022, 01:44 AM IST
COVID-19: మ‌రోసారి క‌రోనా క‌ల‌క‌లం.. అప్ర‌మ‌త్త‌మైన యూపీ.. ఆ న‌గ‌రంలో 144 సెక్షన్  అమ‌లు

సారాంశం

COVID-19: ఉత్తర‌ప్ర‌దేశ్లో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో గౌతం బుద్ధ్ నగర్‌లో 144 సెక్షన్ విధించారు. ఆదివారం నుంచే ఈ నిషేధ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. ఈనెల 1 నుంచి 31 వరకూ నిషేధ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని గౌతం బుద్ధ్ నగర్ పోలీస్ కమిషనరేట్  తెలిపింది.   

COVID-19: దేశంలో రోజురోజుకు కొత్త కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీకి స‌మీపంలో నోయిడాలో కరోనా కేసుల సంఖ్య తీవ్ర‌మ‌వుతున్న‌ది.  అటువంటి పరిస్థితిలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది.యూపీలోని గౌతం బుద్ధ్ నగర్‌లో 144 సెక్షన్ విధించింది. మే 1 నుండి మే 31 వరకు ఈ నిషేధ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని గౌతం బుద్ధ్ నగర్ పోలీస్ కమిషనరేట్  తెలిపింది.
 
బహిరంగ ప్రదేశంలో ప్రజల రద్దీ ఉండదనీ, గౌతమ్ బుద్ నగర్ జిల్లా కమిషనర్ అన్ని బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లను తప్పనిసరి చేశారు. సీఎం యోగి ఆదేశాల మేరకు గౌతమ్ బుద్ నగర్ పాలకవర్గం ఈ ఆంక్షలపై నిర్ణ‌యం తీసుకుంది. ఇటువంటి పరిస్థితిలో.. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశంలో నిరసన లేదా నిరాహార దీక్షలు చేయడానికి అనుమతి ఇవ్వబడ‌వ‌నీ, అలాగే, బహిరంగ ప్రదేశాల్లో పూజలు, ప్రార్థనలు అనుమతించబడవని తెలిపారు.  
 
పాఠశాలల్లో జరుగుతున్న పరీక్షల సందర్భంగా కొవిడ్‌ ప్రోటోకాల్‌ను కచ్చితంగా పాటించేలా ప్రత్యేక దృష్టి సారించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. పరీక్ష సమయంలో మాస్కులు, సామాజిక దూరం పాటించాలి. పరీక్షా కేంద్రాల ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్ల వాడకం పూర్తిగా నిషిద్ధం. దుకాణదారుడు పై అధికారుల అనుమతి లేకుండా ఎవరికైనా లౌడ్ స్పీకర్ లేదా అలాంటి పరికరాలను విక్రయించడానికి లేదా అద్దెకు ఇవ్వడం నిషిద్ద‌మ‌ని అధికారులు తెలిపారు.  

UPలో కరోనా గ్రాఫ్
 
ఉత్తరప్రదేశ్‌లో గత 24 గంటల్లో 269 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో గౌతమ్ బుద్ నగర్‌లో గరిష్టంగా 117 కొత్త కేసులు కనుగొనబడ్డాయి. ఘజియాబాద్‌లో 55, లక్నోలో 26, ఆగ్రాలో 15 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 1587 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 99 శాతం మందిబాధితులు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం