Ashok Gehlot: భారతదేశాన్ని మత, కులాల వారీగా విభజించడం బీజేపీ ఎజెండా: అశోక్ గెహ్లాట్

Published : May 01, 2022, 10:51 PM IST
Ashok Gehlot: భారతదేశాన్ని మత, కులాల వారీగా విభజించడం బీజేపీ ఎజెండా: అశోక్ గెహ్లాట్

సారాంశం

Ashok Gehlot: భారతదేశాన్ని కులాలు, మ‌తాలు ఆధారంగా విభజించాల‌ని బీజేపీ, RSS లు  నిర్ణయించుకున్నాయనీ, అల్ల‌ర్లు  వారి ఎజెండాలో భాగమ‌ని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విమ‌ర్శించారు.  బీజేపీ నిత్యం ఎదోక చోట దాడుల‌కు తెగ‌బడుతోంద‌ని, రాష్ట్రంలో త‌ల్లెత్తిన ఘ‌ర్ష‌ణ‌లకు బీజేపీ కార‌ణ‌మ‌ని విమ‌ర్శించారు.   

Ashok Gehlot: దేశాన్ని మత, కుల ప్రాతిపదికన విభజించడం బీజేపీ ఎజెండాలో భాగమని, దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విమ‌ర్శించారు. గత నెలలో రాజస్థాన్‌లోని కరౌలిలో జ‌రిగిన హింసాకాండ బీజేపీ ప్రయోగమేనని, రామనవమి రోజున రాష్ట్రంలో మరో ఏడు ఘ‌ట‌న‌లు జ‌రిగాయ‌ని, ఇవి బీజేపీ ఎజెండాలోని భాగ‌మ‌నీ, వారి వ‌ల్లే ఘర్షణలు త‌ల్లెత్తాయ‌ని అన్నారు. ఏప్రిల్ 2న నవ్ సంవత్సరం సందర్భంగా.. హిందూ సంస్థలు చేపట్టిన బైక్ ర్యాలీపై ముస్లింలు రాళ్లు రువ్వడంతో కరౌలిలో మతపరమైన ఉద్రిక్తత చెలరేగింది. కరౌలి ఉద్రిక్త‌త‌లు వారి ప్రయోగమేన‌నీ, ఆ అల్ల‌ర్ల‌ను తాము నియంత్రించామనీ, రామ నవమి రోజున ఏడు రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు జరిగాయని అన్నారు. హింసకు హింస సమాధానం కాదని విమ‌ర్శించారు. 

మ‌న‌ దేశాన్ని బీజేపీ, RSS లు కులాలు, మ‌తాలు ఆధారంగా విభజించాల‌ని నిర్ణయించుకున్నాయనీ, ఇది వారి ఎజెండాలో భాగమ‌నీ, ఇది ప్రారంభం మాత్రమేన‌ని విమ‌ర్శించారు. వారు ఎప్పటికప్పుడు దాడులు చేశారని ముఖ్యమంత్రి అన్నారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ మీనా రాష్ట్రంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివిధ అంశాలపై ప్రదర్శనలు చేస్తున్నారు.

అల్వార్‌లోని రాజ్‌గఢ్‌లో దేవాలయాల కూల్చివేతపై బిజెపిని ల‌క్ష్యంగా చేసుకున్న గెహ్లాట్..ఈ ప్రతిపాదనను అక్కడి బీజేపీ ఆమోదించిందని, ఆపై వారు ప్రభుత్వాన్ని నిందించారు. అల్వార్ జిల్లా సరాయ్ మొహల్లాలో 300 ఏళ్ల నాటి శివాలయాన్ని బుల్‌డోజర్‌తో కూల్చివేశారు. ఈ విషయమై రాజ్‌గఢ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఆదివారం రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో 300 ఏళ్ల నాటి శివాలయం, 86 దుకాణాలు, ఇళ్లను బుల్‌డోజర్‌లతో కూల్చివేసి, రోడ్డు మార్గం కోసం మార్గాన్ని క్లియర్ చేశారు. రాజ్‌గఢ్‌లోని 35 మంది కౌన్సిలర్లలో వారికి (బిజెపి) 34 మంది ఉన్నారు. వారు ప్రతిపాదనను ఆమోదించారు మరియు ఆలయాన్ని కూల్చివేశారు. వారు కాంగ్రెస్‌ను పోలరైజ్ చేసి పరువు తీయాలని  చూస్తున్నారని విమ‌ర్శించారు.  

లౌడ్ స్పీకర్ వివాదంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పరోక్షంగా బీజేపీని టార్గెట్ చేశారు. ఎవరి పేరు చెప్పకుండానే కులం, మతం ప్రాతిపదికన రెచ్చగొట్టడం చాలా తేలిక అన్నారు. ఈ దేశం ఎటువైపు వెళ్తుందో ఎవరికీ తెలియదు. పరిస్థితి ప్రమాదకరంగా ఉందని విమ‌ర్శించారు. లౌడ్ స్పీకర్ల సమస్యే లేదన్నారు. ప్రతి మతం కలిసి దీనిపై నిర్ణయం తీసుకుని పరిష్కరించుకోవాలని సూచించారు.

ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం అక్రమ లౌడ్ స్పీకర్లపై వేగంగా చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ రాష్ట్రంలోని మతపరమైన ప్రదేశాలు, ఇతర ప్రదేశాలలో అక్రమంగా అమర్చిన 45,773 లౌడ్ స్పీకర్లను తొలగించగా, 58,861 లౌడ్ స్పీకర్లను స్లో చేశారు. అంతే కాదు హైకోర్టు ఆదేశాలను పూర్తిగా పాటించాలని యోగి ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది.

PREV
click me!

Recommended Stories

భార‌త్‌లో ల‌క్ష‌ల కోట్ల పెట్టుబడులు పెడుతోన్న అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌.. భ‌విష్య‌త్తులో ఏం జ‌ర‌గ‌నుందంటే?
Viral News : ఇక జియో ఎయిర్ లైన్స్.. వన్ ఇయర్ ఫ్రీ..?