Copper Based Face Mask: కరోనావైరస్ వ్యాధి (కోవిడ్ -19) మహమ్మారిపై పోరాడటానికి భారతీయ శాస్త్రవేత్తల బృందం యాంటీవైరల్ మాస్క్‌ను అభివృద్ధి చేసినట్లు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. మంత్రిత్వ శాఖ ప్రకారం.. రాగి ఆధారిత నానోపార్టికల్స్‌తో పూసిన యాంటీవైరల్ మాస్క్ కరోనావైరస్‌తో పాటు అనేక ఇతర వైరల్ మరియు బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా పని చేస్తుందని తెలిపింది.
Copper Based Face Mask: కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. గత రెండున్నరేళ్లు ఈ మహమ్మారి బారిన ఎంతో మంది పడ్డారు. ఎప్పటికప్పుడు రూపం మార్చుకుంటూ విరుచుకుపడుతోంది. ఇప్పుడు ఒమిక్రాన్ రూపంలో అందరినీ వణికిస్తోంది. అయితే.. కరోనా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి ఫేస్ మాస్క్ చాలా ప్రధానమైంది. అయితే ఏ మాస్క్ ధరించాలో.. ఏ మాస్కు సురక్షితమైదో అందరికి సరైన అవగాహన లేదు. ఈ క్రమంలో భారతీయ శాస్త్రవేత్తల బృందం వినూత్నమైన మాస్క్ ను అభివృద్ధి చేశారు. ఈ తరుణంలో భారతీయ శాస్త్రవేత్తల బృందం రాగి ఆధారిత నానోపార్టికల్-కోటెడ్ యాంటీవైరల్ ఫేస్ మాస్క్‌ను అభివృద్ధి చేసింది.
ఈ మాస్క్ కు ప్రమాదకర వైరస్, బ్యాక్టీరియా క్రిములను చంపగల సత్తా ఉంది. మానవాళికి ముప్పుగా మారిన కొవిడ్ వైరస్ ను ఇది అత్యంత సమర్థంగా ఎదుర్కొంటుందని పరిశోధనలో వెల్లడైంది. పైగా సులభంగా శ్వాస తీసుకోవడానికి సహాయపడుతుంది. దీన్నిసులభంగా శుభ్రం చేసుకోవచ్చు. అంతే కాకుండా 99.9 శాతం వైరస్ ను శరీరంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. ఈ మాస్కులు పర్యావరణానికి ఎలాంటి హాని చేయవని, భూమిలో సులువుగా కలిసిపోతాయని పరిశోధకులు చెబుతున్నారు.
undefined
భారతీయ మార్కెట్‌లో యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ మాస్క్‌లు ఖరీదైనవి. ఆసుపత్రులు, విమానాశ్రయాలు, మాల్స్ మరియు రైల్వే స్టేషన్లు వంటి జనావాస ప్రాంతాలలో కరోనావైరస్ వేగంగా విస్తరిస్తోంది. అందువల్ల మరింత భద్రతను అందించే తక్కువ ధర మాస్క్‌ను తయారు చేయడం అవసరం.
కాగా, కాపర్ కోటెడ్ నానోపార్టికల్ కోటెడ్ యాంటీవైరల్ ఫేస్ మాస్క్‌లో ఇంటర్నేషనల్ అడ్వాన్స్ డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ARCI), బెంగళూరుకు చెందిన సెంటర్ ఫర్ సెల్యులార్ & మాలిక్యులర్ బయాలజీ (CSIR-CCMB) వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు బెంగళూరుకు చెందిన రెసిల్ కెమికల్స్ ల భాగస్వామ్యంతో అభివృద్ది చేశారు.
ఈ మాస్కుపై రాగి ఆధారిత నానో పార్టికల్ పూత పూస్తారు. తద్వారా వైరస్ లు ఈ పొరను దాటుకుని రావడం కష్టతరమవుతుంది. ఈ మాస్కు ధరిస్తే శ్వాస తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దాదాపు 20 నానోమీటర్‌ల ఫ్లేమ్ స్ప్రే పైరోలైసిస్‌తో తయారు చేస్తున్నారు. సింగిల్-కోటెడ్, త్రీ-కోటెడ్ మాస్క్‌లు ఉత్పత్తి చేయనున్నాయి.