డ్రైవర్ కు గుండెపోటు, అదుపుతప్పిన స్కూలుబస్సు.. స్టీరింగు తిప్పి, పెనుప్రమాదం తప్పించిన విద్యార్థిని..

By SumaBala BukkaFirst Published Feb 6, 2023, 2:10 PM IST
Highlights

ఓ విద్యార్థిని స్కూలు బస్సు స్టీరింగ్ తిప్పి పెనుప్రమాదాన్ని తప్పించింది. స్కూలు పిల్లల్ని తీసుకెడుతున్న బస్సు డ్రైవర్ కు సడెన్ గా హార్ట్ ఎటాక్ వచ్చింది. ఆ సమయంలో ఆ విద్యార్థిని సమయస్పూర్తితో వ్యవహరించింది. 
 

గుజరాత్ : గుజరాత్ లో ఓ విద్యార్థిని సమయస్పూర్తి, స్పాంటేనిటీ వల్ల పెనుప్రమాదం తప్పింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఓ స్కూల్ బస్సు విద్యార్థులతో వెడుతోంది. ఈ సమయంలో డ్రైవర్ కు హఠాత్తుగా హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో బస్సు అదుపు తప్పింది. ఎదురుగా ఉన్న వాహనాలను ఢీ కొట్టుకుంటూ వెడుతోంది. ఇది గమనించిన బస్సులోని ఓ విద్యార్థిని సమయస్పూర్తితో వ్యవహరించింది. దీంతో బస్సులోని వారి ప్రాణాలుతో పాటు రోడ్డుమీది వారి ప్రాణాలు కూడా కాపాడింది. ఈ ఘటన శనివారం సాయంత్రం గుజరాత్ లోని రాజ్ కోట్ లో జరిగింది. 

గుజరాత్ లోని భరద్ పాఠశాలకు చెందిన ఓ బస్సు విద్యార్థులతో వెడుతోంది. గొండాల్ రోడ్డు దగ్గరికి వచ్చేసరికి.. బస్సు నడుపుతున్న డ్రైవర్ కు గుండెపోటు వచ్చింది. దీంతో అతను మెలికలు తిరిగిపోతూ స్టీరింగ్ వదిలేశాడు. దీంతో బస్సు అదుపుతప్పి డివైడర్ ను గుద్దుకుని.. అది దాటి ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీ కొడుతూ పోతోంది. ఆ బస్సులో ఉన్న భార్గవి అనే విద్యార్థిని ఈ ఘటనకు భయపడకుండా తెలివిగా.. వెంటనే స్టీరింగ్ పట్టుకుని బస్సుని ఆపింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. 

భార‌త్ ప్ర‌కాశాన్ని ఏ మ‌హ‌మ్మారి, ఏ యుద్ధ‌మూ ఆప‌లేదు.. : ఇండియా ఎనర్జీ వీక్ లో ప్ర‌ధాని మోడీ

భార్గవి వ్యాస్ అనే ఆ విద్యార్థిని మాట్లాడుతూ.. ఆ సమయంలో నేను డ్రైవర్ పక్క సీట్లోనే కూర్చున్నాను. మా స్కూలు బస్సు గొండాల్ రోడ్డు దగ్గరికి చేరింది. ఆ సమయంలో ఆయన మాటలు తడబడడాయి. ముక్కునుంచి రక్తం వస్తోంది. నోరు ఓ వైపు పీక్కుపోయింది. స్టీరింగ్ వదిలేసి ఓ పక్కకు పడిపోయాడు. ఒక్క సెకన్ నాకు ఏమయ్యిందో అర్థం కాలేదు. తరువాత వెంటనే తేరుకుని స్టీరింగ్ తిప్పాను.. బస్సు కరెంట్ స్తంభానికి ఢీకొట్టుకుని ఆగింది... అని భార్గవి తెలిపింది. 

ప్రమాదం గురించి తెలిసిన పోలీసులు ఘటనాస్థలికి చేరకున్నారు. వెంటనే డ్రైవర్ ను రాజ్ కోట్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు అక్కడ చికిత్స జరుగుతోంది. ఆ విద్యార్థి సమయస్పూర్తికి అందరూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 

click me!